Tuesday, December 24, 2024

అల్లు అర్జున్‌పై ప్రభుత్వం కక్షసాధింపు

  • సంధ్యా థియేటర్‌ ఘటన పోలీసుల వైఫల్యం
  • మీడియాతో కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

అల్లు అర్జున్‌ ఎపిసోడ్‌పై కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మరోసారి స్పందించారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం కిషన్‌రెడ్డి మాట్లాడారు.ఈ ఘటనలో పోలీసుల వైఫల్యమే ఉందన్నారు. ప్రభుత్వం ఈ ఘటనను అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఈ సంఘటన జరగకుండా చూసుకోవడంలో పోలీసులు పకడ్బందీగా ఎందుకు వ్యవహరిం చలేదని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. రాజకీయాలకు సినిమాలకు ఏం సంబంధమని నిలదీశారు. ఇది రేవంత్‌ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యగానే చూడాలని అన్నారు. సంధ్యా థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు.

తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ ఇవ్వడంతో చర్లపల్లి సెంట్రల్‌ జైలు నుంచి బన్నీని విడుదల చేశారు. ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ విషయంపై మాట్లాడారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఏడాది పాలనలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో సాధించింది ఏం లేదని అన్నారు. రెండు పార్టీలు ప్రజలను నమ్మించి మోసం చేశాయని విమర్శలు చేశారు. ఈ ఏడాదిలో బీజేపీ చాలా సవాళ్లను ఎదుర్కొందని అన్నారు. వొచ్చే ఏడాదిలో ప్రజల మనోభిష్టం మేరకు పనిచేస్తామని తెలిపారు. తమ ముందు ఇంకా అనేక సవాళ్లు ఉన్నాయన్నారు. బీజేపీ , కాంగ్రెస్‌ పార్టీలు ఒక్కటే అని ఎవరు అనరని.. బీజేపీ సిద్దాంతమే కాంగ్రెస్‌ పార్టీను ఓడిరచడమని తెలిపారు. కాంగ్రెస్‌కు తాము ఎప్పుడు వ్యతిరేకమేనని చెప్పారు. ప్రాంతీయ పార్టీలు లేకుండా చేస్తున్నామంటూ బీజేపీపై ఎవరు మాట్లాడినా అది తెలివి తక్కువ తనమే అవుతుందని కిషన్‌రెడ్డి విమర్శించారు.

ప్ర‌దాన వార్త‌లు

దురుద్దేశంతోనే తనపై కేసు పెట్టారన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com