Sunday, September 29, 2024

అల్లు శిరీష్ “బడ్డీ” ట్రైలర్ లాంఛ్

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ “బడ్డీ”. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది. జూలై 26న “బడ్డీ” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

ఎడిటర్ రూబెన్ మాట్లాడుతూ – బడ్డీ సినిమాకు వర్క్ చేయడం కష్టంగానే అనిపించింది. ఎడిటింగ్ టేబుల్ పై నేను దర్శకుడు శామ్ రోజూ డిస్కస్ చేసుకునేవాళ్లం. ఇదొక డిఫరెంట్ మూవీ. బడ్డీ లాంటి చిత్రాలు అరుదుగా వస్తుంటాయి. ఈ సినిమాలో మంచి కాస్టింగ్ ఉంది. వాళ్లతో పాటు మూవీలో బడ్డీది ఒక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఇలాంటి కొత్త తరహా సినిమాను నిర్మించిన ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ గారికి అభినందనలు. మా మూవీ మిమ్మల్ని డిజప్పాయింట్ చేయదు. తప్పకుండా థియేటర్స్ లో చూడండి. అన్నారు.

రైటర్ సాయి హేమంత్ మాట్లాడుతూ – నేను చిన్నప్పుడు యముడు, నా పేరు శివ సినిమాల్లో కేఈ జ్ఞానవేల్ రాజా ప్రౌడ్లీ ప్రెజెంట్స్ అని చూసేవాడిని. ఇదేదో కొత్తగా ఉందని అనిపించేది. ఇవాళ ఆయన తెలుగులో ప్రొడ్యూస్ చేసిన సినిమాకు నేను రైటర్ ను కావడం నాకు గర్వంగా ఉంది. ఈ సినిమాలో గుర్తుండే డైలాగ్స్ చాలా ఉన్నాయి. బడ్డీ చెప్పే ప్రతి డైలాగ్ పంచ్ లా పేలుతుంది. డైరెక్టర్ శామ్ గారు మరిన్ని తెలుగు సినిమాలు చేయాలి, ఆ సినిమాలకు నేను వర్క్ చేయాలని కోరుకుంటున్నా. మా శిరీష్ గారిని కెప్టెన్ అని పిలుస్తాను. ఆయన కెరీర్ లో టిల్ డేట్ ది బెస్ట్ మూవీ బడ్డీ అని చెప్పగలను. అన్నారు.

నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ – హైదరాబాద్ లోని మీడియా మిత్రులను, తెలుగు ఆడియెన్స్ ను, ఇక్కడి మంచి ఫుడ్ ను మిస్ అవుతుంటాను. మీరంతా ఎన్నో ఏళ్లుగా మా స్టూడియో గ్రీన్ సంస్థను ఆదరిస్తున్నారు. మా మూవీస్ కు సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ మా ప్రోగ్రాం హోస్ట్ చేస్తున్న ఆధ్య శ్రేయాస్ శ్రీనివాస్ వాళ్ల పాప. తను బాగా హోస్టింగ్ చేస్తోంది. సుమ గారి ఈవెంట్స్ నెంబర్ ఆధ్య క్రాస్ చేయాలని కోరుకుంటున్నా. గీతా ఆర్ట్స్, స్టూడియో గ్రీన్ కలిసి శామ్ ఆంటోన్ దర్శకత్వంలో ప్రేమకథా చిత్రమ్ సినిమాను తమిళంలో రీమేక్ చేశాం. ఆ సినిమాలో జీవీ ప్రకాష్ ను హీరోగా ఇంట్రడ్యూస్ చేశాం. సంక్రాంతికి రిలీజైన ఆ సినిమా తమిళంలో మంచి హిట్ అయ్యింది. ఇప్పుడు బడ్డీ మూవీ చేస్తున్నాం. ఈ చిత్రంలో అలీ, అజ్మల్ బాగా సపోర్ట్ చేశారు. శామ్ బడ్డీతో మా సంస్థకు మరో మంచి సినిమా ఇస్తున్నాడు. నేను ఈ కథ కంటే శామ్ ను ఎక్కువ నమ్మాను.

ఎడిటర్ రూబెన్, సినిమాటోగ్రాఫర్ కృష్ణన్ వసంత్ ప్రేమకథా చిత్రమ్ రీమేక్ తర్వాత మరోసారి మా సంస్థలో పనిచేస్తున్నారు. రూబెన్ పుష్ప, జవాన్ సినిమాలకు వర్క్ చేశారు. హిప్ హాప్ తమిళ మా బడ్డీ మూవీకి బ్యాక్ బోన్. ఆయన సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చారు. ఇవాళ ఈ కార్యక్రమానికి ఆయన రాలేకపోయారు. ఫైట్ మాస్టర్ శక్తి శరవణన్ ఆకట్టుకునే యాక్షన్ సీక్వెన్సులు చేశారు. మా కంగువ మూవీ వీఎఫ్ఎక్స్ కు వర్క్ చేసిన హరిహర సుతన్ బడ్డీకి కూడా పనిచేశారు. విజువల్ ఎఫెక్టులు న్యాచురల్ గా ఉంటాయి. హీరోయిన్స్ గాయత్రి, ప్రిషా లకు వాళ్ల కెరీర్ లో ఇంపార్టెంట్ ఫిలిం అవుతుంది.

అల్లు శిరీష్ మా కుటుంబ సభ్యుడు లాంటి వారు. ఆయన ఫేవరేట్ హీరో సూర్య. మా జర్నీలో గుడ్ బ్యాడ్ టైమ్స్ లో శిరీష్ సపోర్ట్ గా ఉన్నారు. ఆయన థ్యాంక్స్ చెబుతున్నా. బడ్డీ సినిమా ఫుటేజ్ కొంతమందికి చూపించాను. శిరీష్ బడ్డీలో బాగా కనిపించారు, బాగా నటించారు అని వాళ్లు చెప్పారు. మధుర శ్రీధర్ గారు మా ఆవారా సినిమా టైమ్ నుంచి పరిచయం. ఆవారా సాంగ్స్ మధుర ఆడియోలో రిలీజ్ చేశాం. అప్పటి నుంచి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ గా ఉన్నారు. శ్రీధర్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. జూలై 26న బడ్డీ సినిమాను గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నాం. మీరంతా మా సినిమాను సపోర్ట్ చేసి బ్లాక్ బస్టర్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular