లైంగిక వేధింపులపై విప్లవాత్మకమైన వినూత్నమైన ప్రయత్నమే “కీప్ ది ఫైర్ అలైవ్”. ఇది 1 నిముషం 25 సెకండ్ల షార్ట్ ఫిల్మ్ మాత్రమే కాదు అందరిని ఆలోచింప జేసే అద్భుతమైన దృశ్య కావ్యం. యదార్థసంఘటనలపై స్పృహ కల్పించి, రేపటి తరాన్ని మేలుకొల్పే సారాంశం. ఈ ప్రేక్షక సమాజం తనవైపు చూసి ఆలోచించే కంటెంట్ ఉంది కాబట్టే బ్యూఐటిఫుల్ హీరోయిన్ సంయుక్త
ను ఈ షార్ట్ ఫిల్మ్ ఆకర్షించింది. అందుకే కె ప్రఫుల్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిల్మ్ ను సంయుక్త ప్రెజెంట్ చేయడానికి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా రచయిత దర్శకుడు కే ప్రఫుల్ చంద్ర మాట్లాడుతూ.. నిత్యం మన చుట్టూ జరిగే చాలా విషయాలు మన కోపానికి కారణం అవుతాయి. వాటిలో లైంగిక వేధింపులకు సంబంధించిన విషయాలు బాధతో పాటు కోపాన్ని కలిగిస్తాయి. వాటిని అధిగమించాలంటే కఠినమైన చట్టాలు తీసుకొస్తే సరిపోతుందా అంటే కచ్చితంగా కాదు. వీటి కన్నా స్పృహ అత్యంత ముఖ్యమైనది. మనందరం మనుషులం. ఎవరితో ఎలా ప్రవర్తించాలో మనకు తెలుసు. కానీ మారుతున్న కాలంతో పాటు మనం కొన్ని విలువలు మర్చిపోయాము.