మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణముల్ కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. మూడు ఛానళ్లను బాయ్‌కాట్ చేసింది. బెంగాల్ వ్యతిరేక ప్రచారం చేస్తున్నాయని టీవీ9, ABP ఆనంద, రిపబ్లిక్ ఛానళ్లకు అధికార ప్రతినిధులను పంపొద్దని నిర్ణయించుకుంది. ఆయా ఛానళ్ల ప్రమోటర్లపై దర్యాప్తులు, ఈడీ కేసులు, ఢిల్లీ జమీందార్లను సంతోషపెట్టాల్సిన అవసరాన్ని గుర్తించామంది. ABP ఆనంద చర్చలో టీఎంసీ ఎంపీ కాకోలి ఘోష్, బీజేపీ ఎమ్మెల్యే అగ్నిమిత్ర పాల్ గొడవ పెట్టుకోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది.