Friday, November 15, 2024

అంబానీ ఇంట పెళ్లి రోజు ప్రభుత్వ సెలవు?

ట్రాఫిక్ ఆంక్షలు విధించిన ముంబయి పోలీసులు

భారత దేశ కుబేరుడు, ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేశ్‌ అంబానీ ఇంట్లో పెళ్లంటే మామూలు విషయం కాదు కదా. ఈ పెళ్లికి ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు ఎందరో విచ్చేస్తున్నారు. అందుకే అంబానీ ఇంట పెళ్లి కార్యక్రమానికి హాజరయ్యే దేశ విదేశాల ప్రముఖులకు ట్రాఫిక్‌ సమస్యలు ఎదురు కాకుండా ఉండేందుకు ముంబయి ట్రాఫిక్‌ పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు.

ఇందులో భాగంగా ముంబయి పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. జులై 12 నుంచి 15 వరకు అనంత్‌ అంబానీ-రాధికల వివాహ వేమహోత్సవం జరిగే ముంబయిలోని బాందాకుర్లా కాంప్లెక్స్‌ లోని జియో కన్వెన్షన్‌ సెంటర్‌ పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయని ట్విట్టర్ లో ప్రకటించారు.

ముంబయి ట్రాఫిక్‌ పోలీసులు ట్విట్టర్ లో విడుదల చేసిన ప్రకటన మేరకు 2024 జులై 12 నుంచి 15 వరకు ముంబయిలోని బాందాకుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో సామాజిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. దీనికి పెద్ద సంఖ్యలో దేశ విదేశాల నుంచి అతిథులు, వీఐపీలు విచ్చేస్తున్నారు.

అందుకని భద్రతా కారణాల వల్ల జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌ వైపునకు వెళ్లే వాహనాలను వేరే మార్గానికి మళ్లిస్తున్నామని స్పష్టం చేశారు. ముంబయి పోలీసుల ప్రకటనపై భిన్నమైన కామెంట్స్ వస్తున్నాయి. అంబానీ ఇంట పెళ్లికి ప్రభుత్వం సెలవు ప్రకటించాలని ఓ నెటిజన్ సోషల్ మీడియాలో కామెంట్‌ చేశాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular