ఎవరి ఇంటికి అయినా కరెంట్ బిల్లు అంటే ఎంత వస్తుంది? వందల నుంచి వెయ్యి, రెండు వేల వరకు మరీ అంటే గరిష్టంగా 10 వేలు ఫైనల్ అనుకోండి. అయితే… మీకు ఇక్క ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మన ఇండియాలోనే కుబేరుడు అయిన ముఖేష్ అంబానీ ఇంటికి ఎంత కరెంట్ బిల్లు రావొచ్చు అనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. ఆ ఇంటి కరెంట్ బిల్లు అమౌంట్ షాకింగ్ గా మారింది. అవును… ముకేష్ అంబానీ ఇంటి గురించి చాలా మందికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనే అనుకోవచ్చు. 27 అంతస్తుల యాంటిలియా నివాసం 2005లో ప్రారంభమై 2010లో పూర్తయ్యింది. ముంబైలో ఉన్న అత్యంత లగ్జరీ నివాసమైన ఈ యాంటిలియా నిర్మాణానికి అయిన ఖర్చు అక్షరాలా రూ.15 వేల కోట్లు. ఈ ఇంటి నిర్మాణాన్ని.. అమెరికన్ సంస్థ పెక్రిన్స్ అండ్ విల్, లాస్ ఏంజెలెస్ కు చెందిన హిర్ష్ బెట్నర్ అసోసియేట్స్ అనే నిర్మాణ సంస్థ చేపట్టింది. ఖర్చు పరంగా ఇది బకింగ్ హోమ్ ప్యాలెస్ తర్వాత ప్రపంచంలో రెండో అత్యంత ఖరీదైన నివాసంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోనూ చోటు దక్కించుకుంది. 4,00,000 చదరపు అడుగుల ఈ ఇంటి విద్యుత్ బిల్లు నేషనల్ మీడియా నివేదికల ప్రకారం.. అత్యంత విలాసవంతమైన ఈ నివాసానికి మొదటి నెలలో 6,37,240 యూనిట్ల విద్యుత్ వినియోగం కాగా.. బిల్లు సుమారు 70 లక్షల 70 వేలు అని నివేదికలు చెబుతున్నాయి. దీంతో… ఈ బిల్లు సుమారు 7,000 ఇళ్ల నెలవారీ విద్యుత్ బిల్లుకు సమానమని నిపుణులు చెబుతున్నారు.