Sunday, November 17, 2024

వేయి కోట్లు అంబానీ కొత్త విమానం

బిలియనీర్ ముకేశ్ అంబానీ ‘బోయింగ్ 737 మ్యాక్స్ 9’ విమానం కొనుగోలు చేసారు. దీని విలువ సుమారు రూ. 1,000 కోట్లు. ఈ విమానం గంటకు 838 కి.మీ వేగంతో నాన్ స్టాప్ గా 11,770 కి.మీ ప్రయాణిస్తుంది. ఇందులో ముకేశ్ అభిరుచులకు తగ్గట్లు సకల సౌకర్యాలు ఉండేలా స్విట్జర్లాండ్లో రీ మోడల్ చేయించారు. త్వరలోనే ఈ విమానాన్ని ముంబైకి తీసుకువస్తారు. ఇప్పటికే ముకేశ్ వద్ద 9 ప్రైవేట్ జెట్లు ఉండగా ఈ కొత్తదానితో వాటి సంఖ్య 10కి చేరింది. ఇటీవలే ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయేలా తన చిన్న కుమారుడికి అంగరంగ వైభవంగా పెళ్లి చేశారు. ఇక ఇప్పుడు అత్యంత విలాసవంతమైన విమానాన్ని కొనుగోలు చేసి వార్తల్లో నిలిచారు.
ఈ బోయింగ్ విమానం స్విట్జర్లాండ్‌లో ఉండేది.ఈ ప్రైవేట్ జెట్​కు బేసెల్, జెనీవా, లండన్, లుటన్ విమానాశ్రయాల్లో టెస్టింగ్ చేశారు. అన్ని అప్‌గ్రేడ్‌లు పూర్తయిన తర్వాత, టెస్టులు అన్నీ పూర్తి చేసి దీన్ని ఇండియాకు తీసుకొచ్చారు. ఆగస్టు 27 2024న దీన్ని బేసెల్ నుంచి దిల్లీకి తీసుకుని వచ్చారు. ఇది 9 గంటల్లో 6,234 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ప్రస్తుతం ఈ కొత్త విమానం దిల్లీ ఎయిర్​పోర్టులోని కార్గో టెర్మినల్ సమీపంలో ఉన్న నిర్వహణ టెర్మినల్‌లో ఉంది. రిలయన్స్ హెడ్ క్వార్టర్స్ ఉన్న ముంబయికి త్వరలో ఈ జెట్ రానుందని సమాచారం.
బోయింగ్ 737 MAX 9 ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జెట్‌లలో ఒకటి. ఇది రెండు CFMI LEAP-18 ఇంజిన్‌లతో పనిచేస్తుంది. ఈ విమానం 8401 MSN నంబర్‌ను కలిగి ఉంది. 11,770 కిలోమీటర్లు ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం. బోయింగ్ 737 MAX 9 ధర $118.5 మిలియన్లు.అయితే ఇందులో క్యాబిన్ రెట్రోఫిటింగ్, ఇంటీరియర్ మాడిఫికేషన్ ఖర్చులు ఉండవు. ఈ కొత్త జెట్ బోయింగ్ MAX 8 కంటే పెద్ద క్యాబిన్, కార్గో స్థలాన్ని కలిగి ఉంది. అయితే ఈ అల్ట్రా-లాంగ్ రేంజ్ బిజినెస్ జెట్ కోసం అంబానీ ఫ్యామిలీ రూ.1000 కోట్లకు పైగా ఖర్చు చేసిందని సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular