బాలీవుడ్ కా భాయ్ సల్మాన్ ఖాన్ అభిమానులతో పాటు హేటర్స్ కూడా ఎక్కువే. కానీ, భాయ్ హేటర్స్‌ని మాత్రం పట్టించుకోకుండా కొన్ని దశాబ్దాల నుండి బాలీవుడ్‌లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ఆయనకు సహచర నటీనటులతో కూడా చాలా మంచి సంబంధాలు కొనసాగిస్తారు. మరికొందరు నటులు ఆయనపై తీవ్ర ఆరోపణలు చేసిన సల్మాన్ పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించరు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే… 2016 డిసెంబర్23న అమీర్‌ఖాన్ నటించిన ‘దంగల్’ చిత్రం టైటిల్ గురించి. ఇంతకీ అమీర్‌ఖాన్‌కి ఆ చిత్ర టైటిల్ ఎలా వచ్చిందో ఇటీవలె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. దంగల్ చిత్ర టైటిల్ కోసం సల్మాన్‌ఖాన్ ఆయనకు చాలా సపోర్ట్ ఇచ్చారని అన్నారు. అసలు ఈ టైటిల్ దొరకడానికి కారణమే ఆయన అని అన్నారు. దంగల్ చిత్ర దర్శకుడు నితీష్ తివారి కథ రాసుకున్నప్పుడే సినిమా టైటిల్ కూడా దంగల్ అని రాసుకున్నారు. దీంతో అమీర్‌ఖాన్ ఆ టైటిల్ రైట్స్ కోసం సెర్చ్ చేయగా.. ఆ టైటిల్ రైట్స్ పునీత్ ఇస్సార్ వద్ద ఉన్నట్లు తెలిసింది. పునీత్ ఇస్సార్ మనందరికీ పరిచయం ఉన్న వ్యక్తే టాలీవుడ్‌లో కూడా అనేక చిత్రాల్లో ప్రతినాయకుడి పాత్రలో కనిపించారు ఆయన. దాంతో ఆయనకు పునీత్‌తో పెద్దగా పరిచయం లేకపోవడంతో సల్మాన్‌కు కాల్ చేసి అమీర్‌ఖాన్ నాకు ఆ టైటిల్ ఎలాగైనా కావాలని పునీత్‌తో నాకు పెద్దగా పరిచయం లేదని మీరే నాక టైటిల్ విషయం హెల్ప్ చేయాలని అడిగారు. దీంతో సల్మాన్‌ఖాన్ వెంటనే పునీత్‌కి కాల్ చేసి దంగల్ టైటిల్ గురించి అడిగి ఓసారి పేనీత్‌ని అమీర్‌ఖాన్‌ని కలిపించి టైటిల్ అమీర్‌ఖాన్‌కి ఇప్పించడం జరిగింది. ఆ విధంగా అమీర్‌ఖాన్‌కి దంగల్ మూవీ టైటిల్ లభించింది. ఇక ఈ చిత్రం ఎంత మంచి హిట్ అయిందో అందరికీ తెలిసిన విషయమే.
అంతేకాక వీరిద్దరూ కలిసి కొన్ని చిత్రాల్లో నటించారు. అందులో అందాజ్ అపనా.. అపనా చాలా మంచి హిట్ అయిన విషయం తెలిసిందే. 2016లో రెజ్లింగ్ ఆధారంగా సల్మాన్ ఖాన్ ‘సుల్తాన్’ సినిమా రిలీజై సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. రూ. 90 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 623 కోట్ల వసూళ్లను కైవసం చేసుకుంది. అయితే అదే ఏడాది రెజ్లింగ్ ఆధారంగా నితేశ్ తివారి దర్శకత్వంలో అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన ‘దంగల్’ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఏకంగా కొత్త చరిత్రనే సృష్టించింది.