Thursday, May 8, 2025

అమీర్‌ఖాన్‌తో బన్నీ భేటీ ఎందుకంటే?

ఈ మధ్య కాలంలో తరచూ టాలీవుడ్‌ హీరోలు.. బాలీవుడ్‌ హీరోలు ఏదో ఒక సందర్భంలో ఎక్కువగా కలుసుకుంటున్నారు. అంతేకాదండోయ్‌ వాళ్ళతో కలిసి నటిస్తున్నారు కూడా. వార్‌2 సినిమాలో హృతిక్‌రోషన్‌తో కలిసి జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్‌తో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ భేటీ అయ్యారు. ముంబయిలోని ఆమిర్ నివాసానికి ప్రత్యేకంగా వెళ్లిన బన్నీ ఆయనతో కొద్దిసేపు ముచ్చటించారు. అయితే, అకస్మాత్తుగా ఆమిర్‌తో బన్నీ సమావేశం కావడంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ భారీ ప్రాజెక్టు రాబోతోందని, అందుకోసమే ఆమిర్‌తో బన్నీ భేటీ అయి చర్చించారని బాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ప్రస్తుతం తన తదుపరి చిత్రం ‘సితారే జమీన్ పర్’ పనుల్లో బిజీగా ఉన్న ఆమిర్ ఖాన్ ఆ తర్వాత భారీ బడ్జెట్‌తో మహాభారతం మూవీ తీయాలని చూస్తున్నాడు. ఈ మూవీలో స్టార్ హీరోలు నటిస్తారని ఆయన ఇటీవల ప్రకటించారు. తాజాగా బన్నీ వెళ్లి ఆమిర్‌తో భేటీ కావడంతో మహాభారతం మూవీ కోసమే అన్న చర్చ ఇండస్ట్రీలో నడుస్తోంది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com