– ‘జాతీయ జెండా’ DPతో కొత్త స్ట్రాటజీ.. సోషల్ మీడియాలో #BoycottAamirKhan ట్యాగ్స్
అమీర్ ఖాన్ ‘సితారే జమీన్ పర్’ సోషల్ మీడియాలో బహిష్కరణ విమర్శలు ఎదుర్కుంటోంది. ఈ క్రమంలో అమీర్ తన సోషల్ మీడియా డీపీని జాతీయ జెండాగా మార్చడం హాట్ టాపిక్ గా మారింది. ‘డ్యామేజ్ కంట్రోల్’ చేయడానికి ఇదో కొత్త స్ట్రాటజీ అంటూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ‘సితారే జమీన్ పర్’ చిత్రాన్ని బహిష్కరించాలని నెట్టింట తీవ్ర విమర్శలు వెలువెతుతున్న వేళ.. అమీర్ ఖాన్ తన ఎక్స్, ఫేస్ బుక్ డిస్‌ప్లే పిక్చర్‌ను జాతీయ జెండాగా మార్చారు. ఇది కాస్త మళ్ళీ విమర్శలకు దారితీసింది. ఇంతకముందు డీపీగా వారి సంస్థ లోగో ‘ఎ’ ఉండగా.. ఇప్పుడు భారతీయ జెండాను ఉంచారు. దీంతో ‘డ్యామేజ్ కంట్రోల్’ చేసేందుకు ఇదో కొత్త స్ట్రాటజీ అంటూ అమీర్ ఖాన్ ని ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ‘ఆపరేషన్ సింధూర్ పై లేట్‌గా స్పందించడమే కాకుండా, ఇప్పుడు దేశభక్తి చూపిస్తున్నట్లు డ్రామా చేస్తున్నారేమో!” అని అంటున్నారు. సినిమా బహిష్కరణను ఎదుర్కుంటున్న వేళ డీపీని జాతీయ జెండాగా మార్చడం కేవలం సినిమా ప్రచారంలో భాగమేనని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే, పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత సైన్యం ‘ఆపరేషన్ సింధూర్’ పేరుతో పిఓకెలోని 9 ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి.ఈ చర్యపై దేశం మొత్తం హర్షం వ్యక్తం చేసింది. కానీ, కొంతమంది బాలీవుడ్ సెలెబ్రెటీలు మాత్రం మౌనంగా ఉండిపోయారు. ఇందులో అమీర్ ఖాన్ కూడా ఉన్నారు. ఇప్పుడు తన సినిమా విడుదల కానున్న సమయంలో ఓ ఇంటర్వ్యూలో ‘ఆపరేషన్ సిందూర్’ గురించి మాట్లాడడం చూసి నెటిజన్లు ఆగ్రహించారు. ఆమిర్ ఖాన్ రాబోయే చిత్రాన్ని బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ పై ఆలస్యంగా స్పందించడంతో పాటు టర్కీ పర్యటనలో అమీర్ ఖాన్ పాత వీడియో మరో సారి వైరల్ కావడం కూడా సినిమా విమర్శలను ఎదుర్కోవడానికి కారణమని తెలుస్తోంది.