Tuesday, April 29, 2025

అమీర్ ను రిజక్ట్‌ చేసిన హీరోయిన్లు ఇంతమందా?

స్టార్ హీరో, బాలీవుడ్‌ మిస్టర్ ఫర్పెక్ట్ గా పేరు తెచ్చుకున్న ఆమిర్ ఖాన్‌తో నటించడానికి చాలా మంది హీరోయిన్లు నిరాకరించారు. ఐశ్వర్య రాయ్ నుండి శ్రీదేవి వరకు, ఏ హీరోయిన్లు ఆమిర్ ఖాన్‌తో చేయడానికి ఇష్టపడలేదు. వీళ్ళంతా అమీర్‌ ఆఫర్‌ను తిరస్కరించారు.

ఐశ్వర్య రాయ్ బచ్చన్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్ బచ్చన్ ‘ది కపిల్ శర్మ షో’లో ఆమిర్ ఖాన్ సరసన ‘రాజా హిందుస్తానీ’ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని, కానీ తాను తిరస్కరించానని చెప్పారు.

ప్రియాంక చోప్రా
ప్రియాంక చోప్రా కూడా ఆమిర్ ఖాన్‌తో నటించే ఆఫర్‌ను తిరస్కరించారు. ఆమెకు ఆమిర్ ‘గజినీ’ సినిమాలో నటించమని ఆఫర్ ఇచ్చారు. కాని ఆమె చేయలేదు.

కంగనా రనౌత్
ఈ జాబితాలో కంగనా రనౌత్ పేరు కూడా ఉంది. కంగనా ఆమిర్‌తో పాటు షారుఖ్, సల్మాన్‌లతో కూడా నటించడానికి నిరాకరించారు.

కాజోల్
కాజోల్, ఆమిర్ ఖాన్ జంట ‘ఫనా’ సినిమాతో అందరి మనసులు గెలుచుకుంది. ‘3 ఇడియట్స్’ సినిమాలో ఆమిర్‌తో నటించడానికి కాజోల్‌కు ఆఫర్ వచ్చింది, కానీ ఆమె స్పష్టంగా తిరస్కరించారు.

శ్రీదేవి
ఆమిర్ ఖాన్ ఆఫర్‌ను శ్రీదేవి కూడా తిరస్కరించారు. ఓ సందర్భంలో తాను అమీర్ ఖాన్ తో నటించకపోవడానికి కారణం కూడా చెప్పారు. ఆమిర్ ఎత్తు తనకు సెట్ అవ్వదనే శ్రీదేవి ఆమీర్ తో సినమిాలు చేయలేదట.

దివ్య భారతి
దివంగత స్టార్ హీరోయిన్ దివ్య భారతి కూడా ఆమిర్‌తో నటించడానికి నిరాకరించారు. కెరీర్ బిగినింగ్ లోనే ఆమెకు ఇలాంటి మంచి ఆఫర్ వచ్చింది. కాని ఆమె ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో రిజెక్ట్ చేయక తప్పలేదట.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com