Tuesday, April 29, 2025

అమెరికా పెళ్లి.. అంత ఈజీ కాదు

ఈ మధ్య కాలంలో పెళ్ళి కావలసిన పిల్లలు మన ఇంట్లో ఉంటే చాలు అమెరికా సంబంధం.. మా అమ్మాయి అమెరికా వెళుతుంది అని గొప్పగా చెప్పుకోవడం సర్వసాధరణం అయిపోయింది. అయితే ప్రస్తుతం అమెరికా సంబంధం అంత ఈజీ ఏమీ కాదు. అమెరికా వెళ్ళాలనే డ్రీమ్స్‌కు డినాల్డ్‌ ట్రంప్‌ గండికొడుతున్నారు. అక్రమ వలసదారుల పేరుతో అమెరికా సంబంధం చేసుకోవాలనుకునే వారిపై కూడా పగతీర్చుకుంటున్నాడు. ఇటీవల మైగ్రేషన్‌ రూల్స్‌ టైట్‌ చేయడం వల్ల ఇకపై అమెరికాలో సెటిల్‌ అయిన వాళ్ళనుగానీ, అమెరికన్స్‌నుగాని పెళ్లి చేసుకోవడం కష్టంగా మారుతోందనే టాక్‌ వినిపిస్తోంది. అమెరికాలో సెటిల్‌ అవ్వడానికి పెళ్లిని మార్గంగా చేసుకునే చాలామందికి ఇకపై చిక్కులు తప్పవు. అమెరికా పెళ్లికి ట్రంప్‌ అడ్డంకిగా ఎందుకు మారారు. ట్రంప్‌ కొత్త రూల్స్‌ ఏమిటంటే…?

అమెరికా సంబంధం అంటే డాలర్లలో జీతం.. విలాసవంతమైన జీవితం అమెరికా సంబంధాన్ని ఎవరు కాదనుకుంటారు. కేవలం డాలర్ల డ్రీమ్ మాత్రమే కాదు అక్కడి సంపాదనతో ఇక్కడ ఆస్తులు కూడ బెట్టుకోవచ్చేనా ఆలోచన కూడా ఉంటుంది. ఇలాంటి వారందరిని ట్రంప్‌ ఇప్పుడు టెన్షన్‌లో పెట్టారు. అమెరికా సంబంధం పెళ్లి వరకు ఓకేగాని, భాగస్వామితో కలిసి కలకాలం అమెరికాలో ఉండిపోవడం అంటేనే కష్టం. ఎందుకంటే కఠినమైన ఇమ్మిగ్రేషన్‌ రూల్స్‌, స్క్రటినీలు, అడ్డంకిగా మారాయి. ట్రంప్‌ తీసుకువచ్చిన కొత్త ఇమ్మిగ్రేషన్‌ పాలసీ ప్రకారం…అమెరికాలోనే సెటిలైన వారిని పెళ్లి చేసుకున్నవారు వెంటనే అక్కడికి వెళ్ళడం కష్టం. వీసా కోసం దరఖాస్తు చేసుకున్నవారు అసు ఈ పెళ్లి నిజమైనదాకాదా అన్నది నిరూపించుకోవడానికి పూర్తి ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. వీసా అప్రూవ్‌ కావాలంటే కఠినమైన ఇంటర్వ్యూలు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. పెళ్లి బంధానికి సంబంధించిన స్క్రూటినీ చాలా దారుణంగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ట్రంప్‌ ప్రభుత్వం అక్రమ వలసలను నియంత్రించాలనే ప్రక్రియలో… అక్రమ వలసదారుల్ని స్వదేశాలకు పంపిన తర్వాత గ్రీన్‌ కార్డ్‌ ఉన్నవారిపై కూడా తనిఖాలు పెంచారు. గతంలో గ్రీన్‌ కార్డు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటే, పౌరసత్వం అనేది చాలా సులభంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అక్రమ వలసలపై కఠిన నిబంధనలు విధించడం వల్ల ఈ ప్రకియ కఠినంగా మారింది. దరఖాస్తుదారులు చాలా పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. వీటిలో.. పెళ్లి ధ్రువీకరణ పత్రాలు, ఆర్ధిక ఆధారాలతో పాటు విద్యా, ఉద్యోగం, వగైరా పత్రాలు చాలా ఉన్నాయి.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com