Friday, April 4, 2025

హెలికాప్టర్లతో దోమలను తరలిస్తున్న అమెరికా

లక్షలాది మగ దోమలతో వినూత్న ప్రయోగం

అగ్ర రాజ్యం అమెరికాలో ఉన్న హవాయి రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త ప్రయత్నం మొదలుపెట్టింది. తమ ప్రాంతంలో కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను రక్షించుకునేందుకు బ్యాక్టీరియాతో కూడిన ప్రత్యేక దోమలను అక్కడ విడిచిపెడుతున్నారు. ప్రపంచంలోని అందమైన దీవుల్లో హవాయి దీవులను ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఈ మధ్యకాలంలో స్థానికంగా సుమారు 33 రకాల పక్షులు అంతరించిపోయినట్లు పర్యావరణవేత్తలు గుర్తించారు. మరో 17 రకాల పక్షులు తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటున్నాయని, వీటిలో కొన్ని రకాల పక్షులు వచ్చే సంవత్సరం కల్లా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

అకికి అనే ప్రత్యేక జాతి పక్షుల సంఖ్య 2018లో 450 ఉన్నట్లు అంచనా వేయగా, 2023 నాటికి వాటి సంఖ్య కేవలం ఐదుకు పడిపోవడమే ఇందుకు నిదర్శనంగా చెబుతున్నారు. దీనిపై పర్యావరణవేత్తల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్థానిక ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. శాస్త్రవేత్తలు సూచన మేరకు ప్రత్యేక బ్యాక్టీరియా కలిగిన దోమలను హెలికాప్టర్ల సాయంతో ఆ ప్రాంతంలో విడుదల చేస్తున్నారు. ఇలా ప్రతివారం ఓ హెలికాప్టర్‌ ద్వారా రెండున్నర లక్షల మగ దోమలను తీసుకువస్తున్నారు. ఇప్పటి వరకు కోటి దోమలను వివిధ ప్రదేశాల్లో విడిచిపెట్టినట్లు అధికారులు తెలిపారు.

అమెరికాలోని హవాయిలో మాత్రమే కనిపించే కొన్ని అరుదైన హనీక్రీపర్స్‌ వంటి పక్షిజాతులు మలేరియా ముప్పును ఎదుర్కొంటున్నాయని సైంటిస్టులు గుర్తించారు. ఈ పక్షులను వ్యాధి కారక దోమ కుడితే 90 శాతం చనిపోయే ప్రమాదం ఉందట. మలేరియాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి ఈ పక్షులకు లేకపోవడమే కారణమని తేల్చారు. అందుకే వోల్బాకియా అనే బ్యాక్టీరియాతో కూడిన మగ దోమలను ఉత్పత్తి చేసి.. వీటిని కలిసిన ఆడ దోమలు గుడ్లు పొదగవు. ఇలా క్రమంగా దోమల సంఖ్యను తగ్గించే ఉద్దేశంతో ఈ సరికొత్త ప్రయోగాన్ని అమలుచేస్తోంది హవాయి ప్రభుత్వం.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com