Friday, January 10, 2025

అమీ నిశ్చితార్ధం.. ఇదైనా ఖాయమేనా?

బాలీవుడ్‌ బ్యూటీ అమీజాక్సన్‌ పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. ఈ భామ బాలీవుడ్‌ మాత్రమే కాక కోలీవుడ్‌.. టాలీవుడ్‌లో కూడా నటించింది. ఈ భామ ప్రస్తుతం మరోసారి వార్తల్లో నిలిచింది. జార్జ్‌ పనాయోటౌతో ప్రేమ వ్యవహారం నడిపిన విషయం తెలిసిందే. అతనితో కలిసి ఒక బేబిబాయ్‌ని కూడా కనింది. ఏమయిందో ఏమో తెలియదు కానీ వీరిద్దరూ విడిపోయారు. దీంతో వారి నిశ్చితార్థంను బ్రేక్‌ చేసుకున్నారు. ఇన్నాళ్ల తరువాత మళ్లీ కొత్త జీవితమును ఆరంభించేందుకు సిద్ధం అయ్యింది. నటుడు ఎడ్‌ వెస్ట్‌విక్ తో ప్రేమలో ఉన్నట్లుగా ప్రకటించడంతో పాటు నిశ్చితార్థం అయినట్లుగా కూడా ఆమె ఫోటోల ద్వారా సోషల్‌ మీడియాలో ప్రకటించింది. ఎడ్‌ వెస్ట్‌విక్ తో అమీ జాక్సన్‌ వివాహ నిశ్చితార్థం అందమైన పర్వతాల మధ్య జరిగింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వీరిద్దరి జోడీ చాలా బాగుందని భవిష్యత్తులో వీరిద్దరు కలిసి సంతోషంగా జీవితాన్ని సాగిస్తారనే నమ్మకం ఉందని చాలా మంది ఫ్యాన్స్‌ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బ్రిటీష్ ముద్దుగుమ్మ అయిన అమీ జాక్సన్‌ ఇండియన్ సినిమాలతో పాటు ఇంగ్లీష్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. గత కొన్నాళ్లుగా బిడ్డకు జన్మనివ్వడం వల్ల సినిమాలకు దూరంగా ఉన్న అమీ జాక్సన్‌ మళ్లీ సినిమాలతో బిజీ అవ్వబోతుంది.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com