తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ చైర్‌పర్సన్‌గా మహీంద్రా గ్రూపు సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా నియమితులయ్యారు.అటోమొబైల్, ఏయిరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ, ఐటీ వంటి ప్రముఖ రంగాల్లో మహీంద్రా గ్రూపు సంస్థలకు ప్రస్తుతం ఆయన చైర్మన్‌గా ఉన్నారు. ఇటీవల ఆనంద్ మహీంద్రాతో సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి.. ఆయనకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు, లక్ష్యాలను వివరించారు. ఈ క్రమంలో ఆ యూనివర్సిటీ కి చైర్ పర్సన్ గా కొనసాగాలను కోరారు. కాగా , ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో స్కిల్స్ ఇండియా యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ ఇటీవలే అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీరు ఏడాది పాటు పదవిలో కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.