Saturday, April 5, 2025

అంబానీ ఇంట పెళ్లి సందడి

  • అంబానీ ఇంట పెళ్లి సందడి
  • ఈ నెల 29న ఇటలీలో మొదలుకానున్న వేడుకలు

అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ముకేశ్‌ అంబానీ – నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ ఓ ఇంటివాడు అవుతున్న విషయం తెలిసిందే. రాధికా మర్చంట్‌ తో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో వీరి ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ కూడా అంగరంగ వైభవంగా జరిగాయి. గుజరాత్‌ జామ్‌ నగర్‌లో జరిగిన ఈ వేడుకలకు దేశ, అంతర్జాతీయ ప్రముఖులు హాజరై సందడి చేశారు. ఇక ఇప్పుడు వీరి పెళ్లికి అంబానీ ఫ్యామిలీ ముహూర్తం పెట్టేసింది. ఇందులో భాగంగా ఇప్పటికే పెళ్లి వేడుకలు మొదలు పెట్టేశారు.

రెండు దేశాల్లో వివాహం

వీరి వివాహం రెండు దేశాల్లో జరగనుంది. మొదట మే 29వ తేదీన ఇటలీలో పెళ్లి వేడుకలు మొదలుకాగా.. జూన్‌ 1న స్విట్జర్లాండ్‌ లో ముగియనున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఈ వేడుకలు మొత్తం భారీ క్రూయిజ్‌ షిప్‌లోనే జరగనున్నాయి. ఈ వేడుకలకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖులతోపాటు బాలీవుడ్‌లోని పెద్ద స్టార్స్‌ కూడా పాల్గొననున్నారు. మొత్తం 300 మంది వీవీఐపీలు ఈ వేడుకలకు ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఇక ముకేశ్‌ అంబానీ, నీతా అంబానీ, ఆకాష్‌ అంబానీ మినహా మిగతా అంబానీ ఫ్యామిలీ మొత్తం ఇప్పటికే అక్కడికి చేరుకొని పెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నట్లు తెలిసింది. షారుక్ ఖాన్‌ కుటుంబం, రణబీర్‌ కపూర్‌ – అలియా భట్‌, సల్మాన్‌ ఖాన్‌, ప్రియాంక చోప్రా – నిక్‌ జొనాస్‌, రణ్‌వీర్‌ సింగ్‌ – దీపిక పదుకొణె, కియారా అద్వాణీ – సిద్ధార్థ్‌ మల్హోత్ర, సోనమ్‌ కపూర్‌ – ఆనంద్‌ అహూజా సహా పలువురు స్టార్స్‌ అతిథుల లిస్ట్‌లో ఉన్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. మూడు రోజుల పాటు క్రూయిజ్‌లో జరిగే ఈ పార్టీలో నో ఫోన్‌ విధానాన్ని అనుసరించనున్నారు. ఈ వేడుకల అనంతరం జూలై 6 నుంచి 12 మధ్య ముంబైలో, ఆ తర్వాత ఢిల్లీలో కూడా వేడుకలను నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు సదరు వర్గాలు తెలిపాయి.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com