బుల్లి తెర నుంచి సినిమాల్లో నటించే వరకు ఎదిగిన యాంకరమ్మ అనసూయ గురించి తెలియని వారుండరు. అనసూయ అంటే చాలు అదొకరకమైన క్రేజ్ చాలా మందిలో ఉంటుంది. ‘క్షణం’, ‘రంగస్థలం’, ‘పుష్ప’ లాంటి సినిమాలతో నటిగా ట్రాన్సిషన్ చేసుకుంది. ముఖ్యంగా పుష్పలో ‘దాక్షయణి’ పాత్ర ఆమె కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఇక లేటెస్ట్ గా అనసూయ చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బ్లాక్ టాప్, స్కై బ్లూ స్కర్ట్‌లో ఓ మోడ్రన్ లుక్‌తో అనసూయ స్టైలిష్ గా దర్శనమిచ్చింది. జస్ట్ క్లాసిక్ లుక్ అని చెప్పుకోవచ్చు. మెటాలిక్ ఫాబ్రిక్ టచ్, జిప్ డిజైన్ విత్ స్లీవ్‌లెస్ స్టైల్‌తో ఈ డ్రెస్సింగ్ మోడర్న్ యూత్‌కు తెగ నచ్చేసినట్లు లైక్స్ చూస్తేనే అర్ధమవుతుంది. ఫోటోల్లో ఆమె ఎక్స్‌ప్రెషన్స్ మూడ్స్‌ను బాగా క్యాచ్ చేస్తూ కనిపించాయి. ఒక్కో ఫోజ్‌కి వేరే వేరే మూడ్‌ను చూపించగలిగిన అనసూయ ప్రొఫెషనల్ యాక్ట్రెస్‌గా ఎంత అభివృద్ధి చెందినదో స్పష్టంగా తెలుస్తోంది. ఆమె కళ్లలో కనిపిస్తున్న కాన్ఫిడెన్స్, కెమెరా ఫ్రెండ్లీ నేచర్ అన్నీ ఆమెను మరింత హైలైట్ చేస్తున్నాయి. ఈ ఫోటోలకు భారీ లైక్స్ వస్తుండగా, అభిమానులు కామెంట్స్‌లో “కిల్లర్ లుక్”, “ఎటిట్యూడ్ క్వీన్”, “బోల్డ్ అండ్ బ్యూటిఫుల్” అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫాలోవర్స్‌కి ఫ్యాషన్ ట్రెండ్‌ని పరిచయం చేస్తున్నట్లు కనిపిస్తూనే కొన్ని కామెంట్లు కూడా చేయించుకుంటుంది. ఏదో హీరోయిన్‌లా ఇంతలా ఎక్స్‌ప్రెషన్స్..డ్రెస్లు.. ఫొటోషూట్‌లు అవసరమా అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎదిగిన ఆమె ఎటిట్యూడ్ మాత్రం తగ్గదు అని చాలా మంది అనసూయను ఆడిపోసుకుంటున్నారు. ఇంత మోడ్రన్‌డ్రెస్ వేసుకుని అంచ అరాచకాలు సృష్టించాల్సిన అవసరం లేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.