-
పవన్ కల్యాణ్‌తో మోత మోగిపోద్ది-అనసూయ
-
పవన్ తో కలిసి డ్యాన్స్ చేశానని చెప్పిన అనసూయ
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీసీఎం పవన్ కల్యాణ్ తో డ్యాన్స్ చేశానని ఆనందంగా చెబుతోంది యాంకర్అనసూయ. ఐతే ఏ సినిమాలో ఆమె పవన్ కళ్యాణ్ తో కలిసి డ్యాన్స్ చేసిందో మాత్రం వెల్లడించలేదు. అనసూయ టీమ్ లీడర్‌గా వ్యవహరిస్తున్న ఓ టీవీ షోలో ఈ విషయాన్ని చెప్పింది. పవన్ కళ్యాణ్ తో కలిసి తాను ఓ పాటకు డ్యాన్స్ చేశానని, అందుకు గర్వంగా ఉందని అనసూయ చెప్పుకొచ్చింది. అంతే కాదు టీవీల్లో ఆ పాట మోత మోగిపోద్దంటూ అభిమానులను ఊరించింది. ఐతే అది ఏ సినిమానో చెప్పకుండా ఇదేం ట్విస్ట్.. అంటూ ఫ్యాన్స్ వాపోతున్నారు. అనసూయ కామెంట్స్‌కు సంబంధించిన విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
గతంలో పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన అత్తారింటికి దారేది సినిమాలో అనసూయకు ఓ పాటకు డ్యాన్స్ చేసే ఛాన్స్ వచ్చినా అనివార్య కారణాల వల్ల ఆమె చేయలేదు. తనకు ఇష్టం లేనివారితోకలిసి నటించడం ఇష్టం లేక ఆ అవకాశాన్ని వదులుకున్నట్లు గతంలో చెప్పింది అనసూయ.మరిప్పుడు పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు లేదంటే ఉస్తాద్ భగత్‌సింగ్, అదీ కాదంటే ఓజీ సినిమా.. వీటిలో ఏ సినిమాలో అనసూయ డ్యాన్స్ చేసిందబ్బా అంటూ పవన్ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు.