మహాకాల్ పిక్చర్స్ పతాకంపై ఎస్ ప్రశాంత్ రెడ్డి నిర్మాణంలో శ్రీ విద్యా బసవ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘హత్య’. ఈ చిత్రంలో ధన్య బాలకృష్ణ, పూజా రామచంద్రన్, రవి వర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జనవరి 24న ఈ చిత్రం గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో చిత్రయూనిట్ సోమవారం నాడు మీడియా ముందుకు వచ్చారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన ప్రెస్ మీట్లో.. దర్శకురాలు శ్రీవిద్య బసవ మాట్లాడుతూ.. ‘‘మధ’ చిత్రానికి చాలా కష్టాలు ఎదుర్కొన్నాను. కరోనా వల్ల ఆ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేసుకోలేకపోయాను. ప్రశాంత్ వల్ల ఈ హత్య చిత్రం ఈ స్థాయికి వచ్చింది. పెట్టే ప్రతీ పైసాకి బాధ్యత వహించాలని చాలా జాగ్రత్తగా సినిమాను తీశాం. లాభసాటి ప్రాజెక్టుగా హత్యను మల్చాలని అనుకున్నాను. హత్య షూటింగ్ టైంలో మేం చాలా కష్టాల్ని ఎదుర్కొన్నాం. మధ మూవీని చాలా మందికి చూపించి రిలీజ్ చేయమని అడిగాను. కానీ ఇప్పుడు మాత్రం ఎవ్వరినీ అడగలేదు. మా ట్రైలర్ వచ్చాక డిస్ట్రిబ్యూటర్లే వచ్చి మా సినిమాను అడిగారు. మేం సినిమా చూశాం. మాకు నమ్మకం పెరిగింది. ఈ సినిమా పట్ల నేను చాలా గర్వంగా ఉన్నాను. మా టీం కూడా ఈ సినిమాను చూసి ఫుల్ హ్యాపీగా ఉంది. మేం తప్పులు చేస్తూనే ఫిల్మ్ మేకింగ్‌ను నేర్చుకున్నాం. రవి గారు అద్భుతంగా నటించారు. ఆయన పాత్రకు అందరూ కనెక్ట్ అవుతారు. సుధ పాత్రలో ధన్య అందరినీ ఆకట్టుకుంటుంది. ఎంతో ప్రిపేర్ అయి సెట్స్‌కు వస్తుంది. సలీమ కారెక్టర్లో పూజ మెప్పిస్తుంది. నేను ఓ మహిళా దర్శకురాలిగా.. మరిన్ని ఉమెన్ సెంట్రిక్ కథలు, కారెక్టర్లను రాయాలని అనుకుంటున్నాను. మా కెమెరామెన్ అభి సింక్‌లో పని చేస్తాడు. మ్యూజిక్ డైరెక్టర్ నరేష్‌తో నాకు చాలా ఏళ్ల నుంచి పరిచయం ఉంది. నరేష్ అద్భుతమైన సంగీతం ఇచ్చాడు. అనిల్ ఎడిటింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా జనవరి 24న రాబోతోంది. అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. అందరూ చూసి ఎంజాయ్ చేయండి’ అని అన్నారు.