Monday, May 12, 2025

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి

  • ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి
  • ఏపీలో రెండవసారి ఓటాన్ అకౌంట్ బడ్దెట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్‌కు సంబంధించి మరో కీలకపరిణామం చోటుచేసుకుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ పై టీడీపీ ఆర్డినెన్స్ సుకువచ్చింది. 2024 సాధారణ ఎన్నికల నేపథ్యంలో గత వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఐతే ఎన్నికలు పూర్తై, తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి పాలనా పగ్గాలు చెప్పటింది. ఈ క్రమంలో ఈ నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబందించిన పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారని అంతా అనుకున్నారు.

కానీ అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ మరి కొన్నినెలలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నే కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో వెంటనే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు సంబందించిన ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకువచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు జులై 31 ముగుస్తోంది. దీంతో చంద్రబాబు సర్కార్ మంగళవారం ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ తీసుకువచ్చింది.

ఈ ప్రత్యేక ఆర్డినెన్స్‌కు ఆన్‌లైన్ ద్వారానే మంత్రివర్గంనుంచి ఆమోదం తీసుకుంది ప్రభుత్వం. ఆ తరువాత ప్రక్రియలో భాగంగా గవర్నర్ ఆమోదం కోసం ఓటాన్ అకౌంట్ ఆర్డినెన్స్ ను రాజ్ భవన్ కు పంపింది చంద్రబాబు సర్కార్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే ఒకే సంవత్సరంలో రెండు సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టడం ఇదే మొదటిసారి. సుమారు 1.30 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ తీసుకువచ్చినట్లు సమాచారం.

ఈ యేడాది 2024 సెప్టెంబర్‌ నెలలో పూర్తి స్థాయిలో బడ్జెట్ వేశపెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో రోడ్ల మరమ్మత్తులు, అన్నా క్యాంటీన్ల నిర్మాణాలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో కేటాయింపులు చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తం 40 విభాగాలకు చెందిన డిమాండ్లు, గ్రాంట్లు బడ్జెట్ లో ఉన్నట్లుసమాచారం.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com