Saturday, May 10, 2025

ఆంధ్ర యూనివర్శిటీలో హాస్టళ్ల మూసివేత

– యుద్ధమే ప్రధాన కారణం
భారత్, పాకిస్థాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. వర్సిటీ పరిధిలోని అన్ని విద్యార్థి వసతి గృహాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నందున, ముందుజాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.పరీక్షలు ఇప్పటికే పూర్తయిన విద్యార్థులు తక్షణమే తమ వసతి గృహాలను ఖాళీ చేసి, వారి స్వస్థలాలకు సురక్షితంగా చేరుకోవాలని యూనివర్సిటీ యాజమాన్యం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల సంక్షేమం, భద్రత తమ ప్రథమ కర్తవ్యమని అధికారులు పేర్కొన్నారు. ప్రధానంగా భద్రతా కారణాలతో పాటు, వసతి గృహాల్లో నెలకొన్న నీటి ఎద్దడి సమస్య, వార్షిక మరమ్మతు పనుల నిర్వహణ కూడా ఈ మూసివేతకు ఇతర కారణాలుగా ఆంధ్రా యూనివర్సిటీ రిజిస్ట్రార్ అధికారిక ప్రకటనలో తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com