Friday, April 4, 2025

అంగట్లో ఆడబిడ్డ

  • 3 నెలల పసికందు ఖరీదు రూ. 4.50 లక్షలు
  • ఆర్ఎంపీ సహా ముఠా అరెస్టు

సభ్య సమాజం తలదించుకునేలా కొందరు మహిళలు అంగట్లో ఆడపిల్లను అమ్మకానికి బేరం పెట్టారు. మూడు నెలల పసికందును అమ్ముతున్న ముఠాను మేడ్చల్ జిల్లాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అక్షర జ్యోతి ఫౌండేషన్ చేసిన స్ట్రింగ్ ఆపరేషన్ తో విషయం ముఠా గుట్టురట్టయ్యింది. అక్షర జ్యోతి ఫౌండేషన్ కు చెందిన మహిళలు తమకు ఆడపిల్లలు కావాలని తిరుగుతూ పీర్జాదిగుడా కార్పొరేషన్ రామకృష్ణ నగర్ లో శోభారాణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లో పనిచేస్తున్న ఆర్ఎంపీని సంప్రదించారు.

ఆమె మూడు నెలల చిన్నారిని రూ.4.50 లక్షలకు ఇప్పిస్తానని చెప్పి ముందుగా వారి నుంచి రూ. 10 వేలు అడ్వాన్స్ తీసుకుంది. మరుసటి రోజు పాప కోసం క్లినిక్ కు వస్తానని చెప్పి వారు వెళ్లిపోయారు. ఆ మేరకు బుధవారం పాపకోసం స్వచ్ఛం ద సంస్థ ప్రతినిధులు క్లినిక్ వెళ్ళారు. అక్కడ వేరే మహిళ ఓ పాపను తీసుకొచ్చి స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులకు అప్పగించింది. దీంతో స్వచ్ఛంద సంస్థ ఈ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో వారు స్పాట్ కు వచ్చి ఆర్ఎంపీ డాక్టర్ ను అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు మరికొందరి మహిళలను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com