Friday, May 16, 2025

యానిమాల్‌ తరహా ‘జాట్‌’

నందమూరి బాలకృష్ణ తో వీరసింహా రెడ్డి సినిమాను రూపొందించి సూపర్‌ హిట్‌ ను దక్కించుకున్న దర్శకుడు గోపీచంద్‌ మలినేని వెంటనే మరో సినిమాను చేయాలని భావించినప్పటికీ కొన్ని కారణాల వల్ల చాలా ఆలస్యం అయ్యింది. దాదాపు ఏడాది పాటు జరిపిన చర్చల తర్వాత చివరకు బాలీవుడ్‌ నటుడు సన్నీ డియోల్‌ తో సినిమా మొదలు పెట్టాడు. టాలీవుడ్‌ హీరోతో మొదట ఈ సినిమాను చేయాలని భావించినా కూడా బడ్జెట్‌ విషయంలో కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయని భావించి ఆ సినిమా క్యాన్సల్‌ చేశారు. గదర్ 2 సినిమా తో సూపర్‌ హిట్‌ ను దక్కించుకున్న సన్నీ డియోల్‌ తో తన కథ ను సినిమాగా చేయాలని దర్శకుడు గోపీచంద్‌ మలినేని భావించాడు. పాన్ ఇండియా రేంజ్ లో సన్నీ డియోల్‌ మరియు గోపీచంద్‌ మలినేని కాంబో మూవీ రూపొందబోతుందట. తాజాగా ఈ సినిమాకు ‘జాట్‌’ అనే విభిన్నమైన టైటిల్‌ ను ఖరారు చేసినట్లుగా సమాచారం అందుతోంది. అతి త్వరలోనే ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ను కూడా టైటిల్‌ తో పాటు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. వయసుకు తగ్గ పాత్రలో సన్నీ డియోల్‌ పాత్రలో కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. టాలీవుడ్‌ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమా ను హిందీ సినిమాగా నిర్మిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ అరుదైన కలయిక మూవీని ఇదే ఏడాదిలో విడుదల చేస్తారనే సమాచారం.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com