Tuesday, May 6, 2025

అన్నకు మంత్రి పదవి ఎప్పుడు?

– చంద్రబాబుతో పవన్‌ భేటి
– మంత్రి పదవిపై పరస్పర చర్చలు
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాసేపట్లో భేటీ కానున్నారు. కీలక అంశాలపై వీరిరువురు చర్చించనున్నారు. తన సోదరుడు నాగబాబు మంత్రిగా ప్రమాణస్వీకారం చేసే ముహూర్తంపై పవన్ చర్చించనున్నట్టు సమాచారం. ఏపీ కేబినెట్‌లో నాగబాబుకు చంద్రబాబు సీటు ఇచ్చిన విషయం తెలిసిందే. నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నిక అయిన తర్వాత కేబినెట్ లోకి తీసుకుంటారా? లేక మంత్రి అయిన తర్వాత 6 నెలల్లోపు ఆయన ఎమ్మెల్సీ అవుతారా? అనే విషయంపై పవన్ చర్చించబోతున్నట్టు సమాచారం. నామినేట్ పదవులపై కూడా వీరు చర్చించనున్నారు. జనసేన నుంచి మూడో విడత జాబితాను ముఖ్యమంత్రికి పవన్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు పోలవరంలో పర్యటిస్తున్నారు. పర్యటన ముగిసిన అనంతరం నేరుగా ఆయన సచివాలయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో చంద్రబాబును పవన్ కలుస్తారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com