Wednesday, February 12, 2025

దర్శకుడిగా మారుతున్న మరో కొరియోగ్రాఫర్ సతీష్ రాజ్

తెలుగు తెరపై ఇప్పటిదాకా పలువురు కొరియోగ్రాఫర్ లు దర్శకులుగా మారారు. ప్రభుదేవా, లారెన్స్, విజయ్ బిన్నీ, గణేష్ మాస్టర్ లాంటి కొరియోగ్రాఫర్స్ దర్శకులుగా మారి భారీ సినిమాలు రూపొందించారు. ఈ ప్రముఖ కొరియోగ్రాఫర్స్ బాటలోనే మరో కొరియోగ్రాఫర్ సతీష్ రాజ్ కూడా చేరబోతున్నారు. ఈనేపథ్యంలోనే ఎస్ ఆర్ మూవీ జంక్షన్ పేరుతో ఓ బ్యానర్ ను స్థాపించారు. ఈ బ్యానర్ లోగోను ప్రముఖ నటులు మురళి మోహన్ ఆవిష్కరించారు. సతీష్ రాజ్ స్వయంగా సాయి బాబా భక్తుడు అవడంతో స్వీయ దర్శకత్వంలో సినిమా ప్రారంభించే తన ఇష్టదైవమైన సాయి బాబా కు అంకితం ఇవ్వాలే ఆశయంతో శ్రద్ధ సబూరి పేరుతో ఓ పాటను రూపొందించారు.

ఈ పాటను ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, విజయ్ బిన్నీ మాస్టర్ , ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ కలిసి ఆవిష్కరించారు. ఒక దర్శకుడు సినిమా మొత్తాన్ని మూడు గంటల్లో చూపిస్తే కేవలం మూడు నిమిషాల్లో కథ మొత్తం అర్థమయ్యేలా ఒక్క పాటలో చూపించగలిగిన దర్శకుడే కొరియోగ్రాఫర్ అని ఈ సందర్బంగా మురళి మోహన్ అన్నారు. సతీష్ రాజ్ లాంటి కొరియోగ్రాఫర్లు దర్శకులుగా మారడం వల్ల చిత్రపరిశ్రమలో ఎంతో మంచి సినిమాలు వస్తాయని చెప్పారు. సినిమా ప్రారంభించే ముందు సాయి బాబాకు పాటను అంకితం ఇవ్వడం సతీష్ రాజ్ కు సినిమా పై ఉన్న పట్టుదలను తెలియజేస్తున్నదన్నారు. దర్శకుడిగా మారుతున్న సతీష్ రాజ్ ను మురళి మోహన్ అభినందించారు. ఫిలిం ఛాంబర్ కార్యదర్శి దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి కొరియోగ్రాఫర్ ఒక దర్శకుడేనని అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com