ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి కాల్పులు జరిగాయి. మావోయిస్టులు దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దులోని ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రత బలగాలు ఆ ప్రాంతంలోకి వెళ్లాయి. మావోయిస్టులు కాల్పులు జరపడంతో భద్రత బలగాలు కూడా ఎదురు కాల్పులు జరిపారు. ఈ సంఘటనలో ఒక మహిళా మావోయిస్టు తీవ్రంగా బుల్లెట్లు తగలడంతో అక్కడిక్కడే మృతి చెందింది. ఈమెను పోలీస్ ఉన్నాతాధికారులు గుర్తించారు. ఈమె వరంగల్ జిల్లాకు చెందిన రేణుక అలియాస్ సరస్వతిగా గుర్తించారు. ఈమెపై ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించింది.
ఈమె మావోయిస్టు స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటి ప్రెస్ టీమ్ ఇన్‌చార్జీగా కూడా ఉన్నారు. మృతి చెందిన సంఘటన స్తలం వద్ద భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రిని భద్రత సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. కాల్పులు జరుగుతున్న సమయంలో ఆ ప్రాంతంలో సంచరించిన దళ సభ్యులు భద్రత బలగాల నుంచి తప్పించుకుని పారిపోయినట్లు తెలిసింది. భద్రత బలగాల చేతిలో తరచూ కీలక నేతలు మృత్యువాత పడటంతో మావోయిస్టు పార్టీ బలహీన పడుతుందనే విమర్శలు ఉన్నాయి.