Sunday, April 20, 2025

తెలుగు రాష్ట్రాలకు మరో భారీ వర్ష సూచన

భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయ్యింది. మరీ ముఖ్యంగా విజయవాడ మహా నగరం చిగురుటాకులా వణికిపోయింది. వరదలకు ఎక్కడికక్కడ జన జీవనం స్థంబించిపోయంది. ఇటు తెలంగాణలోను భారీ వర్షాలకు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలు భారీగా ప్రభావితం అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే ఆల్‌ టైమ్ రికార్డు వర్షపాతం నమోదైంది. ఎటు చూసినా వరద, బురద.. ఆకలి కేకలే వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ వరద ప్రభావిత ప్రాంతాల్లో వరద బాధితుల ఆవేదన వర్ణనాతీతం. ఈ సమయంలో మరో పిడుగులాంటి సమాచారం చెప్పింది ఐఎండి. ఈనెల 5న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే ఉందని వాతావరణ కేంద్రం చెబుతోంది. దీంతో రెండు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాల కురుస్తాయట.

గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, యానాం, ఏలూరు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో వచ్చే మూడు నాలుగు రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలంటుని ఐఎండి అధికారులు చెబుతున్నారు. మరోవైపు తెలంగాణలోని ఆదిలాబాద్, ఖమ్మం, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు సిద్దిపేట్, మల్కాజిగిరి జిల్లాల్లోనూ ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. వాతావరణశాఖ అధికారుల హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు అలర్ట్‌ అయ్యాయి.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com