Sunday, September 29, 2024

భారత్ లో మరో మంకీపాక్స్ కేసు నమోదు

మంకీపాక్స్.. ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్న వైరస్. భారత్ లో మంకీపాక్స్ కేసు మరొకటి నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే దేశంలో రెండు మంకీపాక్స్ కేసులు నమోదవ్వగా.. తాజాగా మూడో కేసు నమోదైంది. మూడో మంకీపాక్స్ రోగి ఇటీవలే దుబాయ్ నుంచి భారత్‌కు వచ్చిన కేరళ వాసి అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. బాధితుడికి మంకీపాక్స్‌కు చెందిన క్లాడ్ 1బి వైరస్ సోకినట్లు పేర్కొంది. కేరళలోని మలప్పురంలో రెండవ మంకీపాక్స్ కేసు వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి కూడా దుబాయ్ నుంచి భారతదేశానికి వచ్చాక.. ప్రాథమిక లక్షణాలు కనిపించడంతో రోగిని పరీక్షించి మంకీపాక్స్ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు.
అంతకు ముందు విదేశాలకు వెళ్లి భారతదేశానికి తిరిగి వచ్చిన డిల్లీకి చెందిన వ్యక్తికీ మంకీపాక్స్ వైరస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. ఇలా మొదటి మంకీపాక్స్ కేసు ఢిల్లీలో నమోదైంది. ప్రాథమిక లక్షణాలు కనిపించిన తర్వాత రోగిని ఢిల్లీలోని ఆసుపత్రిలో ఐసోలేట్ చేశారు. ఐసోలేషన్ సమయంలో రోగి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు చెప్పారు. దీంతో విదేశీ ప్రయాణం చేసే వ్యక్తులు ఎవరైనా సరే ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఆరోగ్య శాఖకు తెలియజేయాలని కేరళ ఆరోగ్య మంత్రి చెప్పారు. ఆఫ్రికాలో మంకీపాక్స్ కేసులు అంతకంతకు పెరుగుతున్న నేపధ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కొన్ని వారాల క్రితం ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. రెండేళ్ల క్రితం కూడా మంకీపాక్స్ వైరస్ ప్రపంచంలోని చాలా దేశాల్లో వ్యాపించిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టడం కుట్రే... ఇందులో జ‌గ‌న్ పాత్ర ఉంది అన్న వర్ల రామయ్య వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular