-
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హసీనాకు మరో షాక్
-
ఆశ్రయం ఇచ్చేందుకు నో చెప్పిన బ్రిటన్
బంగ్లాదేశ్‌మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరో షాక్ తగిలింది. ఆమెకు ఆశ్రయం ఇచ్చేందుకుబ్రిటన్ ప్రభుత్వం అంగీకరించలేదు. దీంతో భారత్ లో తాత్కాలికంగా ఆశ్రయం పొందుతున్న షేక్హసీనాకు ఏంచేయాలో దిక్కుతోచడం లేదు. బంగ్లాదేశ్‌లో అవామీలీగ్ నేతృత్వంలోని ప్రభుత్వం కుప్పకూలిపోవడంతో షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేసి తాత్కాలికంగా భారత్‌లో ఆశ్రయం పొందుతున్నారు.బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని ప్రధాని ప్యాలెస్‌ను ఆందోళన కారులుచుట్టుముట్టడం, పరిస్తితులు చేయిదాటిపోవడంతో45 నిమిషాల్లో ప్రధాని పదవికిరాజీనామా చేసి, దేశం విడిచి పారిపోవాలని బంగ్లా ఆర్మీ ఇచ్చిన హెచ్చరికలతో సోదరి షేక్ రెహానాతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వచ్చారుషేక్ హసీనా.
ఢిల్లీలోతాత్కాలికంగా ఉండి, ఇక్కడి నుంచిలండన్ వెళ్లి అక్కడే స్థిర పడాలని నిర్ణయించుకున్నారు షేక్ హసీనా.ఈ మేరకు బ్రిటన్‌లో తనకు ఆశ్రయం కల్పించాలని అక్కడి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఐతే తాజాగా ఈ విషయంపై స్పందించినబ్రిటన్ అధికారిక ప్రతినిధి షేక్ హసీనాకు తలుపులు తెరిచిలేవని తేల్చిచెప్పారు. ఒక వ్యక్తి ఆశ్రయంకోసం లేదా శరణార్థిగా తమ దేశానికి వచ్చేందుకుతమ వలసచట్టాలు అంగీకరించవని బ్రిటన్ హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. ఏదైనా అవసరంలో ఉన్న వారికి రక్షణ కల్పించే విషయంలో బ్రిటన్‌కు ఎంతో మంచిరికార్డు ఉందని, చాలా మందికి అలా రక్షణ కల్పించినట్లు ఆయన చెప్పుకొచ్చారు.
ఐతేఆశ్రయం కోరుతూ లేదా తాత్కాలిక శరణార్థిగా ఒక వ్యక్తి బ్రిటన్వచ్చేందుకు అనుమతించేలా తమ వలస చట్టాల్లోఎలాంటి నిబంధన లేదని ఆయన చెప్పారు. అంతర్జాతీయ రక్షణ కోరేవారు ప్రస్తుతం వారు ఉంటున్న సురక్షిత ప్రదేశంలోనే ఆశ్రయం పొందాలని సూచించారు. అదే వారి రక్షణకు అత్యంత సులభమైన మార్గమని బ్రిటన్ హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి అన్నారు. షేక్ హసీనా బ్రిటన్‌లో ఆశ్రయం పొందడంకంటే ఇప్పుడు ఉన్న భారత్ లోనే ఆమె ఉండాలని పరోక్షంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.దీంతో షేక్ హసీనా మరికొన్నాళ్లు ఇండియాలోనే ఉండనున్నారని తెలుస్తోంది.
బంగ్లాదేశ్మాజీ ప్రధాని షేక్ హసీనాసోదరి షేక్ రెహానా బ్రిటన్ పౌరురాలు. అంతే కాకుండా షేక్ రెహానా కూతురు తులిప్ సిద్దిఖీ ప్రస్తుతం బ్రిటన్‌లో అధికారంలో ఉన్నలేబర్ పార్టీ తరఫున పార్లమెంట్ సభ్యురాలిగా ఉన్నారు. ఈ నేపధ్యంలోనే బ్రిటన్‌ప్రభుత్వం తనకు ఆశ్రయం ఇస్తుందని షేక్ హసీనా భావించినట్లు తెలుస్తోంది.కానీ ఆమెకు బ్రిటన్ ప్రభుత్వంనుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఏంచేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో పడిపోయారు. ఈపరిస్థితులన్నింటిపై భారత ప్రభుత్వం సైతం ఆచితూచి అడుగులువేస్తోంది.