Saturday, April 19, 2025

తెలంగాణలో వెలుగులోకి వచ్చిన మరో జలపాతం

తెలంగాణలో ప్రకృతి సహజసిద్దమైన జలపాతాలకు కొదవే లేదు. తెలంగాణ నయాగరా గా చెప్పుకునే బొగత జలపాతం అందరికి కనువిందు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిగో ఇప్పుడు మరో అద్భుతమైన జలపాతం బయటపడింది. ప్రకృతికి నెలవైన ధట్టమైన అడవీప్రాంతంలో ఈ కొత్త జలపాతం నెలవై ఉంది. తెలంగాణ ఛత్తీస్గడ్ సరిహద్దు ప్రాంతమైన ములుగు జిల్లా అడవుల్లో ఈ అద్భుత జలపాతం బయట పడింది. ఈ జలపాతాన్ని చూసేందుకు అప్పుడే సందర్శకులు బారులు తీరారు.

ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని మహితాపురం సమీప అటవీ ప్రాంతంలో ఈ జలపాతం కనువిందు చేస్తోంది. ఈ జలపాతానికి చేరుకోవాలంటే సుమారు రెండు కిలోమీటర్ల మేర అటవిలో కాలినడకన వెళ్ళాల్సి ఉంటుంది. జలపాతం సుమారు 120 అడుగుల ఎత్తైన కొండలపై నుండి పాల ధారలా కిందకు దూకుతుంది. కొండలపై నుండి పాల ధారలుగా జాలువారుతున్న ఆ జలపాతం సందర్శకులను బాగా ఆకట్టుకుంటోంది. మంత్రముగ్ధులను చేస్తున్న ప్రకృతి అందాలను ఆస్వాదించేందుకు సందర్శకులు పోటీపడుతున్నారు.

మహితాపురం జలపాతం దగ్గర పర్యాటకుల కోలాహలం నెలకొంది. ఈ మధ్య కురిసిన వర్షాలతో మహితాపురం జలపాతానికి జలకళను సంతరించుకుంది. ప్రకృతి అందాలను వీక్షిస్తూ మహితాపురం జలపాతం వద్ద ఈత కొడుతూ, సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. కొండలు, గుట్టలు, దట్టమైన అడవి, పచ్చని చెట్ల మధ్య ఎత్తైన కొండలపై నుండి జాలువారుతున్న మహితాపురం జలపాతాన్ని వీక్షించేందుకు సమీప ప్రాంతాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా సందర్శకులు వస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com