Thursday, January 9, 2025

అంతా ఆయనే చేశారు..!

ఏసీబీ, ఈడీ విచారణకు హాజరైన అరవింద్, బీఎన్‌ఎల్ రెడ్డి

మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించడానికి ముందే అరవింద్ కుమార్‌ను ప్రశ్నించడం వల్ల కేసు దర్యాప్తుకు సంబంధించి కీలక అంశాలు బయటపడతాయని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అలాగే ఈ కేసుకు సంబంధించి హెచ్‌ఎండీఏ మాజీ సీఈ బీఎన్‌ఎల్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ, ఈడీ దర్యాప్తును ముమ్మరం చేశాయి. ఈ కేసులో అప్పటి పురపాలక శాఖ ప్రత్యేకకార్యదర్శి అరవింద్ కుమార్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించి హెచ్‌ఎండీఏ మాజీ చీఫ్ బీఎన్‌ఎల్ రెడ్డి ఈడీ విచారణకు హాజరుకాగా.. బీఎన్‌ఎల్ రెడ్డి స్టేట్‌మెంట్‌ను ఈడీ అధికారులు రికార్డు చేస్తున్నారు. మరోవైపు తన ఏసీబీ విచారణ న్యాయవాదుల సమక్షంలో జరిగేలా చూడాలని కేటీఆర్‌ ఈరోజు హైకోర్టును ఆశ్రయించారు. కాగా.. ఫార్ములా ఈ రేస్ కేసులో ఇప్పటికే కీలకమైన ఆధారాలు బయటపడిన నేపథ్యంలో ఈరోజు జరిగే విచారణకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్.. ఏసీబీ కార్యాలయానికి చేరకోగా కాసేపటి క్రితమే ఏసీబీ విచారణ ప్రారంభమైంది. అతడి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన తర్వాత ఈ కేసులో కీలక మలుపు తిరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో రూ.55 కోట్లు విదేశీ కంపెనీకి బదిలీ చేయడం వెనుక ఉన్న అసలు కోణాలు ఏంటి.. అప్పటి మంత్రి కేటీఆర్ ఆదేశాలతోనే ఈ డబ్బులను రిలీజ్ చేశారా.. అసలేం జరిగింది అనే అంశాలపై అరవింద్ కుమార్‌ నుంచి ఏసీబీ అధికారులు స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయనున్నారు. ఈరోజు సాయంత్రం వరకు విచారణ కొనసాగనుంది.

నిబంధనలు ఉల్లంఘన
ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌తో ఏకీభవించిన కాంపిటెంట్ అథారిటీ ఆమోదం పొందకుండానే మొత్తం 54 కోట్ల రూపాయలకు పైగా నగదును ఎఫ్‌ఈవో చెల్లింపు ద్వారా ఉల్లంఘనలకు పాల్పడ్డారు. ఫార్ములా ఈ రేసు కేసులో జరిగిన ఒప్పందంలో హెచ్‌ఎండీ భాగస్వామి కానప్పటికీ చెల్లింపులు చేసింది. పార్టీల మధ్య అక్టోబర్ 30, 2023 నాటి ఒప్పందంపై సంతకం చేయడానికి ముందే చెల్లింపులు జరిగాయి. ఈసీఐ నుంచి ఎటువంటి ఆమోదం తీసుకోకుండా ఎంసీసీ అమలులో ఉన్నప్పుడు కొంత భాగం చెల్లింపు జరిగింది. విదేశీ మారకపు చెల్లింపులకు సంబంధించి ఇప్పటికే ఉన్న నియమాలు, నిబంధనలను ఉల్లంఘిస్తూ విదేశీ కరెన్సీలో చెల్లింపులు జరిపారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com