Monday, April 21, 2025

అంత డిప్రషన్‌కి వెళ్ళడానికి అదే కారణం

– మళ్ళీ సినిమాల్లో చేయడానికి రెఢీ
– గుర్తింపు తెచ్చే ఏ పాత్రైనా చేస్తా
‘చిత్రం’ సినిమాలోని ‘బబ్లూ’ పాత్రను ఎవరూ మరిచిపోలేరు. ఆ సినిమాలో ఆయనపై చిత్రీకరించిన ‘ఆ అమెరికా అమ్మాయి మావో’ సాంగ్ ఇప్పటికీ అందరికీ గుర్తే. అలాంటి బబ్లూ తెరపై కనిపించక చాలాకాలమే అయింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన కెరియర్ గురించిన విషయాలను ప్రస్తావించాడు.

“చైల్డ్ ఆర్టిస్టుగా నా కెరియర్ ‘ముద్దుల మేనల్లుడు’ సినిమాతో మొదలైంది. ఆ తరువాత చాలానే సినిమాలు చేశాను. నా అసలు పేరు ‘సదానంద్’. జంధ్యాల ‘పోపుల పెట్టె’ సీరియల్ లో నేను చేసిన ‘బబ్లూ’ పాత్రనే నా పేరుగా మారిపోయింది. ఇక టీనేజ్ లోకి అడుగు పెట్టిన తరువాత ‘చిత్రం’ సినిమాలో చేసే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా తరువాత ఫుల్ బిజీ అయ్యాను. పవన్ కల్యాణ్, బన్నీ, చరణ్ ల సినిమాలు చేసే ఛాన్స్ వచ్చింది” అని అన్నాడు.

“లైఫ్ హ్యాపీగా సాగిపోతూ ఉండగా, నా కుటుంబ సభ్యులను ఒక్కొక్కరిగా కోల్పోతూ వచ్చాను. ఆ సమయంలో నేను డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను. అసలు ఇంట్లో నుంచి బయటికి రాకపోవడం వలన, సినిమాలకు దూరమయ్యాను. ఆ తరువాత చేయాలనుకున్నప్పుడు నచ్చిన పాత్రలు రాలేదు. చిన్న పాత్రలే అయినా గుర్తింపు తెచ్చేవి అయితే చేయడానికి ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నాను” అని తెలిపాడు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com