Saturday, April 5, 2025

‘యాంటీ డ్రగ్ అవేర్ నెస్ ప్రోగ్రామ్’ కు సపోర్ట్ గా ముందుకొచ్చిన రెబెల్ స్టార్

సమాజ హితం కోరే ఏ కార్యక్రమానికైనా తన వంతు సపోర్ట్ అందించేందుకు ఎప్పుడూ ముందుంటారు రెబెల్ స్టార్ ప్రభాస్. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన యాంటీ డ్రగ్ అవేర్ నెస్ కార్యక్రమానికి తన మద్ధతు ప్రకటించారు ప్రభాస్. ఈ కార్యక్రమాన్ని సపోర్ట్ చేస్తూ డ్రగ్స్ వద్దు అనే సందేశాన్ని అందించారు ప్రభాస్. తన మెసేజ్ తో కూడిన వీడియోను ఆయన రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ప్రభాస్ స్పందిస్తూ – లైఫ్ లో మనకు బోలెడన్ని ఎంజాయ్ మెంట్స్ ఉన్నాయి. కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ఉంది. మనల్ని ప్రేమించే మనషులు, మన కోసం బతికే మన వాళ్లు ఉన్నప్పుడు ఈ డ్రగ్స్ అవసరమా డార్లింగ్స్. డ్రగ్స్ ను ఈ రోజు నుంచే వదిలేయండి. మీకు తెలిసిన ఎవరైనా డ్రగ్స్ కు బానిసలు అయితే టోల్ ఫ్రీ నెంబర్ 8712671111 కు కాల్ చేయండి. వారు పూర్తిగా కోలుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అని చెప్పారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com