Sunday, May 11, 2025

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా చర్యలు తీసుకోవాలన్న వైసిపి

అమరావతి: వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా చర్యలు తీసుకోవాలన్న వైసిపి సభ్యులు. ప్రైవేటీకరణ ఉద్దేశమే లేదన్న మంత్రి టిజి భరత్. అయితే అనేక సమస్యలున్నాయి వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి భరత్. సెయిల్ లో విలీనం చేయడం, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు చెల్లించకపోవడం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయడమే అన్న వరుదు కల్యాణి.

డిప్యూటీ సిఎం వైజాగ్ స్టీల్ ప్లాంట్ పై ప్రకటన చేయాలని సూచించిన ఛైర్మన్. ప్రైవేటీకరణ కాకుండా చూడటమే తమ లక్ష్యమన్న పవన్ కళ్యాణ్. స్టీల్ ప్లాంట్ ఏ ఒక్కరిదో ప్రాంతానిదో కాదు రాష్ట్రానికి చెందినదన్న పవన్ కళ్యాణ్ గతంలోనే అమిత్ షా దృష్టికి తీసుకెళ్ళామన్న పవన్. గతంలో కూడా భూములు అమ్మాలని ప్రభుత్వం సూచిస్తే కార్మికులు మమ్మల్ని సంప్రదించారన్న పవన్. గతంలో ఉన్న సమస్య పరిష్కారం కోసమే భూములు అమ్మాలన్న నిర్ణయమన్న బొత్స

పిఎం సభలోనే ప్రైవేటీకరణ వద్దని జగన్ చెప్పారన్న బొత్స. ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేయలేదన్న పవన్ కళ్యాణ్. ప్రైవేటీకరణ ఆపే శక్తి ఉంది కాబట్టే ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయలేదన్న బొత్స నాడు త్రికరణ శుద్ధిగా ప్రయత్నిస్తే నేడు ప్రైవేటీకరణ ప్రశ్నే ఉత్పన్నం అయ్యేది కాదన్న పవన్ కళ్యాణ్.

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వైసిపి ఆందోళన. వైజాగ్ ఉక్కు, ఆంధ్రుల హక్కు. జై జగన్ అంటూ వైసిపి నినాదాలు. సభను పదినిమిషాల పాటు వాయిదా వేసిన ఛైర్మన్.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com