దురై మురుగన్ తమిళనాడు జనవరుల శాఖ మంత్రి ప్రస్తుతం వార్తల్లో నిలిచారు. ఏపీ, బీహార్ తదితర రాష్ట్రాల మహిళలను కించపరుస్తే వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రాల మహిళలకు ఇప్పటికీ విద్యా హక్కు లేదని పేర్కొన్నారు. కానీ, తమిళనాడులో తందై పెరియార్ పోరాటాల ఫలితంగా మహిళలకు విద్యా హక్కు సాధ్యమైందని చెప్పారు. ఆ కారణంగా రాష్ట్రంలో మహిళలు పురోగతి సాధిస్తున్నారని పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అంతటా దుమారం రేపుతున్నాయి.
తమిళనాడు, కేరళలో మహిళల విద్యకు తందై పెరియార్ పోరాటాలు చేసి మార్గదర్శిగా నిలిచారని, రాష్ట్రంలో తొలి వైద్యురాలిగా మత్తులక్ష్మీరెడ్డి రికార్డులకెక్కారని మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్, బీహార్ తదితర రాష్ట్రాల్లో మాత్రం ఇప్పటి వరకు మహిళలకు విద్యాహక్కు లేదని మంత్రి దొరై మురుగన్ వ్యాఖ్యానించారు.