Sunday, October 6, 2024

తెలంగాణాపై చంద్రబాబు ఫోకస్!

7వ తేదీన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నేతలతో భేటీ
ఏపీ టీడీపీని పట్టాలు ఎక్కించిన పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఇక తెలంగాణ పై కూడా ఫోకస్  పెట్టనున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో సైకిల్ పార్టీకి తిరిగి  పూర్వ వైభవం  తీసుకురావాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 6వ తేదీన హైదరాబాద్ కు వస్తున్న ఆయన 7వ తేదీన తెలంగాణ  పార్టీ నేతలతో సమావేశం కానున్నారని  సమాచారం.  నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించాక చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‍కు రావడం ఇదే తొలిసారి. దీంతో తెలంగాణ టీడీపీ నేతలు, కార్యకర్తలు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ మీటింగ్‌లో తెలంగాణ టీడీపీకి నూతన అధ్యక్షుడి నియామకం, పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
ఇప్పటికీ క్షేత్రస్థాయిలో టీడీపీ బలంగా ఉందని చంద్రబాబు భావిస్తున్నారు.  ప్రధానంగా ఉమ్మడి రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో టీడీపీ క్యాడర్ ఎటువైపు మొగ్గూచూపితే ….ఆ పార్టీ అభ్యర్ధులు అతి సులభంగా విజయం సాధిస్తున్నారు. ఇది ఆరు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో నూ స్పష్టమైంది. రాజకీయ వ్యహంలో భాగంగానే ఆ రెండు ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయలేదు. ఇది కాంగ్రెస్ పార్టీకి లాభం చేకూర్చగా……బీఆర్ఎస్ కు భారీ లాస్ తీసుకొచ్చింది. చంద్రబాబు కొట్టిన సైలెంట్ రివేంజ్ తో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ గిలగిల కొట్టుకుంటున్న విషయం తెలిసిందే. అయినరప్పటికీ పార్టీ తిరిగి పూర్వవైభవం రావాలంటే చంద్రబాబు అడపా, దడపా తెలంగాణలోనూ పర్యటిస్తేనే సాధ్యమవుతుందని తెలుగు తమ్ముళ్ళు భావిస్తున్నారు. అయితే తెలంగాణలో టీడీపీ సింగల్ గా వస్తుందా లేక ఏపీలో  జనసేన, బీజేపీతో జతకట్టి కూటమీగా వస్తుందా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.
ఇటీవల కొండగట్టుకు వచ్చిన  జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం తెలంగాణలో పొత్తు విషయాన్ని ప్రస్తావించటం చర్చగా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగానే బీజేపీ, జనసేన తెలంగాణలో కలిసి పని చేస్తాయన్నారు. అయితే టీడీపీ విషయాన్ని పవన్ ప్రస్తావించకపోవడం సస్పెన్స్‌గా మారింది. తెలంగాణలో అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల్లో టీడీపీ పోటీకి దూరంగా ఉన్నందువల్లే పొత్తుల విషయంలో టీడీపీ పేరును పవన్ ప్రస్తావించలేదని ఒక వేళ భవిష్యత్‌లో జరగబోయే ఎన్నికల్లో టీడీపీ పోటీకి సై అంటే బీజేపీ, జనసేన, టీడీపీ కలిసే కూటమిగా ముందుకు వెళ్తాయనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అయితే దీనిపై తెలంగాణ బీజేపీ ఎలా రియాక్ట్ అవుతుందనేది ఆసక్తిని రేపుతున్నది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular