పీలోని బనకచర్లకు గోదావరి నీళ్లు తరలింపుపై ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు కీలక వాఖ్యలు చేశారు. సముద్రంలో వృధాగా కలుస్తున్న జలాలను తాము తరలించుకుంటున్నామని, దానికి అడ్డు రావద్దని తెలంగాణ ప్రభుత్వానికి సూచించారు. గోదావరి జలాలను వాడుకోవడంలో తెలంగాణ విఫలమవు తుందన్నట్లుగా చంద్రబాబు వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా తాము కాళేశ్వరం ప్రాజెక్టుకు అడ్డు చెప్పలేదని, బనకచర్లకు గోదావరి నీళ్లపై తెలంగాణ అభ్యంతరం చెప్పొద్దు అని చంద్రబాబు సూచించారు. గోదావరి నీళ్లు బనకచర్లకు తీసుకెళ్తామని, గతంలో కాళేశ్వరం నిర్మిస్తే తామేం అభ్యంతరం చెప్పలేదని పదేపదే వ్యాఖ్యానించారు. సముద్రంలో వృధాగా కలిసే గోదావరి నీళ్లు వాడుకుంటే ఎవరూ బాధ పడాల్సిన అవసరం లేదని చంద్రబాబు అన్నారు.
వృధా నీటిని తీసుకెళ్తామంటే అభ్యంతరం చెప్పొద్దు
‘పోలవరం ప్రాజెక్టు నీళ్లు బనజకచర్లకు తీసుకెళ్తాం. బంగాళాఖాతంలో సముద్రంలోకి పోయే వృథానీటిని సీమకు తీసుకెళ్తామంటే అభ్యంతరం చెప్పొద్దు అని తెలంగాణకు ప్రజలను కోరుతున్నా. తెలుగుజాతి కోసం మా పార్టీ పుట్టింది. ఏపీ విభజన సమయంలోనూ 2 ప్రాంతాలు సమానమని, 2 కళ్లు అని, సమన్యాయం చేయాలని కేంద్రాన్ని అడిగాను.
ఇక్కడ అధికారం రాగా, తెలంగాణలో 20 స్థానాలు ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తే ఎప్పుడూ వ్యతిరేకించలేదు. గోదావరిపై ప్రాజెక్టులు కట్టుకోవాలని సైతం చెప్పా. ఏటా 1000 టీఎంసీల నీళ్లు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయి. సముద్రంలోకి వెళ్లే నీటిని తీసుకెళ్తామంటే హక్కు లేదని చెప్పడం సరికాదని’ చంద్రబాబు పేర్కొన్నారు.