Monday, May 12, 2025

కూటమిదే అధికారం!

బాబే సీఎం అంటూ మెజార్టీ సర్వే సంస్థల అంచనా
కూటమి దెబ్బకు ఫ్యాన్ రెక్కలు కట్ అంటూ కేకే సంస్థ సంచలన ప్రకటన
అసెంబ్లీ ఎన్నికల్లో కూటమికి 161 సీట్లు
వైసీపీకి కేవలం 14 స్థానాలు వస్తాయని వెల్లడి
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు

ఏపీలో కూటమిదే అధికారమని పలు సర్వే సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించాయి. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు జరిగిన
ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు.. ఏ రాజకీయ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందనే దానిపై వివిధ మీడియా సంస్థలు తాము సేకరించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను శనివారం విడుదల చేసాయి. ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. అధికార వైసీపీ ఒంటరి పోరుకే మొగ్గుచూపగా.. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా బరిలోకి దిగాయి. తెలుగుదేశం పార్టీ 144 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాల్లో బరిలోకి దిగగా.. జనసేన 21 ఎమ్మెల్యే, 2 ఎంపీసీట్లలో పోటీచేసింది. బీజేపీ 10 ఎమ్మెల్యే, 6 లోక్ సభ స్థానాలలో బరిలో నిలిచింది, కాంగ్రెస్ పార్టీ వామపక్షాలతో కలిసి ఎన్నికల బరిలో నిలిచింది. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు మే 13వ తేదీ జరగ్గా.. ఫలితాలు జూన్ నాలుగో తేదీన వెల్లడికానున్నాయి. అధికారాన్ని కైవసం చేసుకునేందుకు కావాల్సిన మెజారిటీ మార్కు 88. మరి ఈ మెజారిటీ మార్కును కూటమి కైవసం చేసుకుంటుందా.. లేదా వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ మరోసారి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందా అనే దానిపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ద్వారా వివిధ మీడియా సంస్థలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. ఏపీ ప్రజలు మళ్లీ చంద్రబాబునాయుడుకే ముఖ్యమంత్రి పదవిని కట్టబోతున్నారని స్పష్టం చేశాయి.

ప్రముఖ కేకే సర్వే సంస్థ అయితే సంచలన ఎగ్జిట్ పోల్స్ ను వెల్లడించింది. ఆ సంస్థ ఎగ్జిట్ పోల్స్ లో కూటమి దెబ్బకు ఫ్యాన్‌ రెక్కలు కట్ అంటూ ప్రకటించింది. కూటమికి ఏకంగా 161 అసెంబ్లీ సీట్లను గెలుచుకోనుందని వెల్లడించింది. ఇక వైఎస్ఆర్ సీపికి కేవలం 14 సీట్లకే పరిమితం అవుతుందని వెల్లడించింది. ఇక రాష్ట్రంలోని 25 లోక్ సభ స్థానాలను కూడా కూటమికే దక్కనున్నాయని…. ఒక్క సీటు కూడా వైసీపీ రాదని వెల్లడించింది. ఈ సంస్థతో పాటు వివిధ సంస్థలు వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.

జనగళం (అసెంబ్లీ)
కూటమి 104 – 118 సీట్లు
వైసీపి 44- 57 సీట్లు
ఇతరులకు…0 .

ఇండియా టీవీ ( లోక్ సభ)
వైఎస్సార్‌సీపీ – 3-5
టీడీపీ కూటమి – 20-25
ఇతరులు – 0

ప్రిజమ్
వైఎస్సార్‌సీపీ – 60
టీడీపీ కూటమి – 110
ఇతరులు – 0

చాణక్య స్ట్రాటజీస్
వైసీపీ – 39-49
టీడీపీ కూటమి – 114-125
ఇతరులు – 0

ఎస్ – జీఈడీ సర్వే
వైఎస్సార్‌సీపీ -36
టీడీపీ కూటమి -139
ఇతరులు – 0

ఎస్ఏఎన్ సర్వే
వైఎస్సార్‌సీపీ – 48
టీడీపీ కూటమి – 127
ఇతరులు – 0

ఏబీపీ సీఓటర్ ఎగ్జిట్ పోల్స్ ( లోక్ సభ)
వైఎస్సార్‌సీపీ- 0-4
టీడీపీ కూటమి- 21-25
ఇతరులు- 0

సీఎన్ఎన్ న్యూస్ -18 ( ఏపీ లోక్ సభ)
వైఎస్సార్‌సీపీ – 5-8
టీడీపీ కూటమి – 19-22
ఇతరులు – 0

ఆరా ఎగ్జిట్ పోల్స్
వైఎస్సార్‌సీపీ – 94-104
టీడీపీ కూటమి – 71-81
ఇతరులు – 0

ఆరా ఎగ్జిట్ పోల్స్ (ఏపీ లోక్ సభ)
వైఎస్సార్‌సీపీ – 13-15
టీడీపీ కూటమి – 10-12
ఇతరులు – 0

భారత్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ సెంటర్
వైఎస్సార్‌సీపీ – 112-143
టీడీపీ కూటమి – 32-63
ఇతరులు – 0

పీపుల్ పల్స్
వైఎస్సార్‌సీపీ – 45-60
టీడీపీ – 95 -110
జనసేన – 14-20
బీజేపీ- 02-05
ఇతరులు – 0

పార్థ ఎగ్జిట్ పోల్స్
వైఎస్సార్‌సీపీ – 110- 120
టీడీపీ కూటమి – 55 -65
ఇతరులు – 0

పయనీర్ పోల్ స్ట్రాటజీస్
వైఎస్సార్‌సీపీ – 31
టీడీపీ కూటమి – 144
ఇతరులు – 0

టీవీ 9 పోల్ స్ట్రాట్ ఎంపీ స్థానాలు (25)
వైఎస్సార్‌సీపీ – 13
టీడీపీ కూటమి – 12
ఇతరులు – 0

పీటీఎస్ గ్రూప్
వైఎస్సార్‌సీపీ – 44 – 47
టీడీపీ కూటమి – 128-131
ఇతరులు – 0

చాణక్య ఎక్స్
వైఎస్సార్‌సీపీ – 47
టీడీపీ కూటమి – 109
హోరాహోరీ – 19
ఇతరులు – 0

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com