విజయవాడలోని హోంమంత్రి అనిత నివాసాన్ని వరద చుట్టుముట్టింది.రామవరప్పాడు వంతెన కింద హోంమంత్రి నివాసం ఉండే కాలనీ అంతా జలదిగ్బంధం అయింది.కాలనీ ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు మంత్రి అనిత సహాయక చర్యలు చేపడుతున్నారు.నిన్న అర్ధరాత్రి వరకు హోంమంత్రి అనిత ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలు చేపట్టారు.