Thursday, March 13, 2025

మంత్రి కోమటిరెడ్డిని కలిసిన ఆంధ్రప్రదేశ్ కార్మికశాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్

శనివారం: బంజారాహిల్స్ లోని మంత్రుల నివాస సముదాయంలో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ మర్యాదపూర్వకంగా కలిసారు.

ఇరు రాష్ట్రాల తాజా రాజకీయ పరిస్థితులతో పాటు.. రెండు రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాల తీరుతెన్నుల గురించి ఇరువురు నేతలు చర్చించుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆర్ఆర్ఆర్, మూసీ శుద్ధీకరణ గురించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. వాసంశెట్టి సుభాష్ కు వివరించగా… ఆంధ్రప్రదేశ్ తో అనుసంధానించే ఎన్.హెచ్-65 విషయంలో మీరు చూపిన చొరవ వల్ల ఆంధ్రా తెలంగాణ మధ్య రవాణా పరిస్థితులు మరింత మెరుగుపడతాయని ఈ సందర్భంగా వాసంశెట్టి సుభాష్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అభినందించారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com