ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడ్డ నూతన ప్రభుత్వంలో మొత్తం 25 మంది బుధవారం మంత్రులు గా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కల్యాణ్ మరో 22 మంది ప్రమాణం చేసినవారిలో ఉన్నారు.
25మందిలో 17 మంది కిపైగా కొత్తవారికి అవకాశం ఇచ్చారు చంద్రబాబు. ముగ్గురు మహిళలు, ఎనిమిది మంది బీసీలు , ఎస్సీలు ఇద్దరు, ఎస్టీ ఒకరు, ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి, వైశ్యుల నుంచి ఒకరికి అవకాశం దక్కింది. నలుగురు కాపులు, నలుగురు కమ్మ, ముగ్గురు రెడ్లకు అవకాశం కల్పించారు. మరో స్థానాన్ని ఖాళీగా ఉంచారు.
1. నారా చంద్రబాబు నాయుడు (కుప్పం)
2. కొణిదెల పవన్ కళ్యాణ్ ( పిఠాపురం)
3. కింజరాపు అచ్చెన్నాయుడు (టెక్కలి)
4. కొల్లు రవీంద్ర (మచిలీపట్నం)
5. నాదెండ్ల మనోహర్ (తెనాలి)
6. పి.నారాయణ (నెల్లూరు సిటీ)
7. వంగలపూడి అనిత (పాయకరావుపేట)
8. సత్యకుమార్ యాదవ్ (ధర్మవరం)
9. నిమ్మల రామానాయుడు (పాలకొల్లు)
10. ఎన్.ఎమ్.డి.ఫరూక్ (నంద్యాల)
11. ఆనం రామనారాయణరెడ్డి (ఆత్మకూరు)
12. పయ్యావుల కేశవ్ (ఉరవకొండ)
13. అనగాని సత్యప్రసాద్ (రేపల్లె)
14. కొలుసు పార్థసారధి (నూజివీడు)
15. డోలా బాలవీరాంజనేయస్వామి (కొండేపి)
16. గొట్టిపాటి రవి కుమార్ (అద్దంకి)
17. కందుల దుర్గేష్ (నిడదవోలు)
18. గుమ్మడి సంధ్యారాణి (సాలూరు)
19. బీసీ జనార్థన్ రెడ్డి (బనగానపల్లె)
20. టీజీ భరత్ (కర్నూలు)
21. ఎస్.సవిత (పెనుకొండ)
22. వాసంశెట్టి సుభాష్ (రామచంద్రాపురం)
23. కొండపల్లి శ్రీనివాస్ (గజపతినగరం)
24. మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి (రాయచోటి)
25. నారా లోకేష్ (మంగళగిరి)