వైఎస్ షర్మిలా రెడ్డి, ఏపి పిసిసి చీఫ్ నిన్న జరిగిన క్యాబినెట్ లో కూడా సూపర్ సిక్స్ పైన కనీసం మాట్లాడలేదు. సూపర్ సిక్స్ పోయి సూపర్ సిక్స్ పాలసీ లను ప్రవేశ పెట్టారు. నిన్న క్యాబినెట్ లో చెప్పినవి అన్ని అమలు చేసే సత్తా టిడిపి, చంద్రబాబుకి ఉందా 2014 లో చంద్రబాబు చెప్పినవి ఏవీ అమలు చేయలేదు రాష్ట్రంలో నిరుద్యోగం చాల పెద్ద సమస్య జాబ్స్ ఫస్ట్ అని చంద్రబాబు చెప్పడాన్ని నేను స్వాగతిస్తున్నా.
ఉన్నత చదువులు చదువుకున్న విద్యార్దులు, వారి చదువుకు దక్క ఉద్యోగం రాక చిన్న ఉద్యోగాలు చేస్తున్నారు. చంద్రబాబు, మోడీ కలిసి రాష్ట్రానికి 50 లక్షల ఉద్యోగాలు ఎలా ఇస్తారో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తారో స్పష్టం చేయాలి.ఏపీపీఎస్సీ కి ఇప్పటికీ ఇంకా చైర్మన్ నియమించలేదు. ప్రైవేటు, గవర్నమెంట్ సెక్టర్లలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎలా కల్పిస్తారో చంద్రబాబు వైట్ పేపర్ రిలీజ్ చేయాలి.
రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల ఎంపీ లు బీజేపీకి ఊడిగం చేస్తున్నారు. మోడీకి ఇచ్చిన మాట లోకేష్ నిలబెట్టుకున్నాను అంటున్నారు. ఏపీకి ఇచ్చిన మాట మోడీ ఎందుకు నిలబెట్టుకోవడంలో లోకేష్ అడగాలి పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రానిది, మరి ఇంకా పోలవరం ఎందుకు పూర్తిచేయడం లేదు అమరావతి నీ న్యూఢిల్లీ చేస్తా అని చెప్పిన మోడీ, ఆంధ్రుల నోట్లో మట్టి కొట్టి పోయారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ నీ కాపాడు కోలేని స్థితిలో ఏపి ప్రభుత్వం ఉంది సూపర్ సిక్స్ పథకాల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రజాస్వామ్యం కోసం అవసరం అయితే పేపర్ బ్యాలెట్ కి మద్దతు ఉంటుంది. వైసిపి హయంలో లిక్కర్ మాఫియా తాడేపల్లి కేంద్రంగా జరిగింది. టిడిపి హయంలో లిక్కర్ మాఫీయా ప్రతి నియోజకవర్గంలో తమ్ముల ఆధ్వర్యంలో జరుగుతుంది.