ఆంద్రప్రదేశ్ లో సంచలనం రేపుతున్న ముంబై సినీనటి జత్వాని కేసులో పోలీసులు వేగంగా విచారణ జరుపుతున్నారు. ఈ కేేసులో కీలక నిందితుడు కుక్కల విద్యాసాగర్ అరెస్ట్ తో మరిన్ని విషయాలు వెలుగులేకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. విద్యాసాగర్ ను డెహ్రాడూన్ లో అదుపులోకి తీసుకున్న పోలీసులు, సోమవారం కోర్టులో హాజరుపర్చి.. కస్టడీ కోరబోతున్నారు. కుక్కల విద్యాసాగర్ అరెస్ట్ తో నటి జత్వాని కేసులో సంచలనల విషయాలు బయటకు వస్తాయాని అంతా భావిస్తున్నారు. ముగ్గురు ఐపీఎస్ అధికారుల మెడలకు ఉచ్చు బిగుసుకుంటుందని అంటున్నారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులు, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపై ఆరా తీస్తున్నామన్నారు.
ఇక ఈ కేసు కీలక దశకు చేరిన నేపథ్యంలో ముంబై సినీనటి జత్వానీకి భద్రత కల్పించారు ఏపీ పోలీసులు. ఆమెకు వన్ ప్లస్ వన్ భద్రత కల్పింటినట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఐపీఎస్ అధికారి కాంతిరాణా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సోమవారం కోర్టులో విచారణ జరగనుంది. సినీనటి జత్వాని కేసులో నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించాడని ఇప్పటికే ఐపీఎస్ అధికారి కాంతిరాణాతో పాటు మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు