- మణికొండ మున్సిపాలిటీలో దూకుడు
అక్రమ కట్టడాలు అంటూ మరోసారి హైడ్రా కూల్చివేతలు మొదలెట్టింది. గురువారం మణికొండ మున్సిపాలిటీలో దూకుడు పెంచింది. అల్కాపురి కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో కమర్షియల్ షెట్టర్స్‌ను అధికారులు తొలగించారు. రెసిడెన్షియల్‌గా అనుమతులు తీసుకుని కమర్షియల్‌గా వ్యాపార సముదాయాలు నడిపిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో గత వారం హైడ్రా కమీషనర్ రంగనాథన్ అక్రమ నిర్మాణాలను పరిశీలించారు. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ అదేశాల మేరకు అక్రమంగా నడుస్తున్న వ్యాపార సముదాయాలను గురువారం తొలగించారు. దీంతో అధికారులకు వ్యాపారస్తులకు మద్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. మణికొండ మునిసిపాలిటీకి లక్షల రూపాయలు కమర్షియల్ ట్యాక్స్ చెల్లించామని, ఎలా కూల్చివేస్తారంటూ వ్యాపారుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ బాడా వ్యక్తి ఒత్తిడి మేరకు కూల్చివేతలు చేసారంటూ వ్యాపారుల ఆందోళన చేపట్టారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టారంటూ వ్యాపారులు మండిపడ్డారు.