Friday, November 15, 2024

కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్ , మంసుఖ్ మాండవీయ లకు లేఖ రాసిన: వైఎస్ షర్మిలా రెడ్డి

వైఎస్ షర్మిలా రెడ్డి, APCC చీఫ్

గౌరవ సుప్రీంకోర్టు 2022 నవంబర్‌లో EPS 95 పింఛనర్ల ప్రయోజనాలపై వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కానీ రెండేళ్ల తర్వాత కూడా ఇందుకు అనుగుణంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవటం వల్ల వేలాది కుటుంబాలు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నాయి.

ఈ ఆలస్యం @socialepfo పై ప్రతికూల ప్రభావం చూపుతుంది, ఇది ప్రపంచంలోనే క్లయింట్ల సంఖ్య, ఆర్థిక లావాదేవీలు పరంగా, అతిపెద్ద సంస్థగా గుర్తించబడింది. పింఛనర్లు తగినంత పింఛన్లు అందక బాధకు గురవుతున్నారు. 1990లలో ప్రవేశపెట్టిన ఈ పథకం కాలక్రమేణా తగ్గిపోయింది.

రిటైర్ అయిన వారి నుండి రుసుములు వసూలు చేసిన లక్షల కోట్ల రూపాయలు @socialepfo వద్ద నిల్వ ఉన్నాయి, అయితే ఒక సంవత్సర కాలంగా పింఛన్లు విడుదల చేయబడలేదు. స్పష్టంగా చెప్పాలంటే, @socialepfo వృద్ధుల సంక్షేమాన్ని విస్మరించింది. మరి మోదీ ప్రభుత్వానికి ఈ సమస్యను పరిష్కరించడంలో సమర్థత లేదా?అసలు బాధ్యత ఎవరిదీ?..

గౌరవ ఆర్థిక మంత్రి శ్రీమతి @NSitharaman గారికి మరియు గౌరవ కార్మికశాఖ మంత్రి శ్రీ మంసుఖ్ మాండవీయ గారికి తక్షణం జోక్యం చేసుకోవాల్సిందిగా కోరుతూ లేఖ రాయటం జరిగింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular