విజయవాడ
పాత రాజరాజేశ్వరి పేటలో వరద బాధితులను పరామర్శించిన apcc చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి
బుడమేరు వరదపై టీడీపీ – వైసిపి బురద రాజకీయాలు చేస్తున్నాయి – వైఎస్ షర్మిలా రెడ్డి
బుడమేరు వరదకు ఇద్దరు కారణమే
ఒకరు కాంట్రాక్టులు ఇచ్చారట. మరొకరు వాటిని రద్దు చేశారట
చంద్రబాబు గారు మీరు విరాళాలు తీసుకోవాల్సింది చిన్న పిల్లల దగ్గర కాదు
బీజేపీకి ఊడిగం చేశారు కదా..10 వేల కోట్లు తీసుకు రండి
వరద కారణంగా సర్వం కోల్పయిన వారి కుటుంబాలకు లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలి
వైఎస్ షర్మిల రెడ్డి
APCC చీఫ్
– బుడమేరు భీభత్సం అంతా ఇంతా కాదు
– బుడమేరు తీరని శోకాన్ని మిగిల్చింది
– గత రెండు వారాలుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు
– వరదలకు ఇప్పటి వరకు 50 మంది చనిపోవడం దారుణం
– దాదాపు 7లక్షల మంది నిరాశ్రయులయ్యారు
– విజయవాడ మన రాజధాని నగరం
– ఇంతా నష్టం జరిగితే పాలకులు నిద్ర పోతున్నారు
– వరదలకు 6800 కోట్లు నష్టం జరిగిందని బాబు చెప్పాడు
– ఆయన చెప్పిన నష్టం వరకు అయినా కేంద్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు
– వస్తున్నారు..నష్టం అంచనా అంటున్నారు
– రూపాయి మాత్రం కేంద్రం నుంచి రాలేదు
– బీహార్ లో రొడ్లకోసం అని 10 వేల కోట్లు ఇచ్చారు
– మరి ఆంధ్ర మీద కేంద్రానికి ఎందుకు సవతి తల్లి ప్రేమ ?
– ఇంతా నష్టం జరిగితే మోడీ కనీసం రాలేదు
– ఆయన దేశాలు పట్టుకొని తిరుగుతున్నాడు
– ఆంధ్ర ఎంపీలతో మోడీ అధికారం అనుభవిస్తున్నాడు
– ఇలాంటి విపత్తులో మోడీ కనీసం స్పందన లేదు
– బీజేపీ చేసిన మోసం పై చంద్రబాబు సమాధానం చెప్పాలి
– విజయవాడ లో జనాల కొంప కొల్లేరు అయ్యింది
– కేంద్రం నుంచి కనీసం మంచి నీళ్ళు కూడా ఇవ్వలేదు
– గుక్కెడు నీళ్ళు అందక ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు
– అన్ని వదిలేసుకొని కట్టుబట్టలతో రోడ్లపై పడ్డారు
– రేషన్ బియ్యం ఇస్తున్నారు కానీ అవి దొడ్డు బియ్యం అంట
– ట్యాంకర్ తో నీళ్ళు ఇస్తున్నారు కానీ అవి కాలనీలకు చేరడం లేదు
– నేను స్వయంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రికి లేఖ రాశా
– కనీసం మంచినీళ్ళు ఇవ్వమని అడిగా
– విశాఖ వేదికగా రైల్ నీరు తయారవుతుంది
– విజయవాడకి రైల్ నీర్ ఇవ్వాలని అడిగా
– విజయవాడ నుంచి ప్రతి ఏటా 6 వేల కోట్ల ఆదాయం వస్తుంది
– ఇంతా ఆదాయం వస్తుంటే కేంద్రం కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు
బుడమేరు వరదకు టీడీపీ – వైసిపి లు బురద రాజకీయాలు చేస్తున్నాయి
– వైఎస్ఆర్ హయాంలో బుడమేరు కి వరద రాకుండా ఆపరేషన్ కొల్లేరు చేపట్టారు
– బుడమేరు కట్టలను కూడా మరమత్తులు చేశారు
– వైఎస్ఆర్ మరణం తర్వాత బుడమేరు ను పట్టించుకున్న వాళ్ళు లేరు
– ఇప్పుడు ఆపద వచ్చిందని ఒకరి మీద ఒకరు బురద జల్లుకుంటున్నారు
– చంద్రబాబు మొదటి 5 ఏళ్లు బుడమేరు ను ఎందుకు పట్టించుకోలేదు ?
– చంద్రబాబు ఇచ్చిన కాంట్రాక్టు లను జగన్ ఎందుకు రద్దు చేశాడు ?
– బుడమేరు బురదకు ఇద్దరు కారణమే
– బుడమేరు కారణంగా ప్రతి ఇంటికి నష్టం జరిగింది
– కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం
– ప్రతి ఇంటికి కనీసం లక్ష సహాయం ఇవ్వాలి
– ప్రజలను పట్టించుకోని ప్రభుత్వాలు నిలదొక్కుకున్నట్లు చరిత్రలో లేదు
– తక్షణం ప్రతి ఇంటికి 15 వేల పరిహారం అయినా ఇవ్వండి
– కొంతలో కొంత బాధితులకు సహాయం చేసినట్లు అవుతుంది
– చంద్రబాబు చిన్న పిల్లల దగ్గర డబ్బులు తీసుకోవడం విడ్డూరం
– బాబు డబ్బులు తీసుకోవాల్సింది బీజేపీ నుంచి
– ఆంధ్ర రాష్ట్ర ఎంపీలు బీజేపీ లో ఊడిగం చేస్తున్నారు
– ఇది పబ్లిసిటీ స్టంట్
– చిన్నపిల్లల దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం మాని కేంద్రం నుంచి 10 వేల కోట్లు సహాయం తీసుకు రండి