Wednesday, December 4, 2024

ఆపేది లేదు పుష్ప… పుష్ప 2కి తెలంగాణ హైకోర్టు లైన్ క్లియర్

మరో రెండు రోజుల్లో థియోటర్లలో సందడి చేయనున్న పుష్ప 2 సినిమాకు తెలంగాణ హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఈ సినిమా టికెట్‌ ధరలను ఇప్పటికే భారీ పెంచారు. అధిక మొత్తంలో టికెట్ చార్జీలు వసూలు చేయడాన్ని అడ్డుకోవాలని సతీష్ కమాల్ అనే సామాజిక కార్యకర్త కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టికెట్‌ ధరలు ఎక్కువ పెంచేయడంతో… సినీ ప్రేక్షకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, టికెట్‌ ధరలను వెంటనే తగ్గించాలని, సాధారణ టికెట్ రేట్లకు అమ్మాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. బెనిఫిట్ షో పేరుతో 800 వసూలు చేయడం అన్యాయమంటూ పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే, ఈ పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ధర్మాసనం.. కీలక తీర్పు ఇచ్చింది. చివరి నిమిషంలో సినిమా రిలీజును ఆపలేమని, టికెట్‌ ధరలపై నిర్ణయం చెప్పలేమంటూ హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు తీర్పుతో పుష్ప 2 సినిమాకు న్యాయపరమైన ఇబ్బందులు తొలిగిపోయాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తాం అన్న కేటీఆర్ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular