రిలయన్స్ ఇండస్ట్రీ సృష్టించిన చరిత్ర గురించి అందరికీ తెలిసిందే. ప్రతిష్ఠాత్మక ఫ్యూచర్ బ్రాండ్ 2024 గ్లోబల్ ర్యాంకింగ్స్ లో రెండో స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో ప్రపంచంలో అతిపెద్ద కంపెనీలైన ఆపిల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్ తదితర సంస్థలను వెనక్కి నెట్టింది. ఈ ర్యాంకింగ్స్ లో రిలయన్స్ 13వ స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది.
ర్యాకింగ్స్ లో శాంసంగ్ తొలి స్థానంలో నిలబడింది. 2023లో ఐదో స్థానంలో ఉన్న శాంసంగ్… 2024లో తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. 2023లో ఆపిల్ తొలి స్థానంలో ఉండగా… 2024లో మూడో స్థానానికి పడిపోయింది. మార్కెట్లో బ్రాండ్ కు ఉన్న ప్రభావం, వినియోగదారుల విశ్వాసం, బ్రాండ్ అభివృద్ధి క్రమాన్ని బట్టి ర్యాంకులను కేటాయించారు. ప్రపంచ వ్యాప్తంగా టాప్ 100 కంపెనీలకు ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ ర్యాంకులను ఇస్తారు.