Thursday, November 14, 2024

మార్కెట్ లోకి ఐఫోన్-16.. ఫీచర్స్ అదిరిపోయాయి

ప్రపంచవ్యాప్తంగా టెక్‌ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్న ఐఫోన్-16 మార్కెట్లోకి వచ్చేసింది. కాలిఫోర్నియాలోని యాపిల్‌ పార్క్‌లో జరిగిన కార్యక్రమంలో టెక్‌ దిగ్గజం యాపిల్‌ ఐఫోన్‌-16 సిరీస్‌ ఫోన్లతో పాటు ఎయిర్‌ పాడ్స్‌ 4, యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 10 ను‌ చేసింది. ఐఫోన్‌-16 సిరీస్‌ ఫోన్లు అనేక కొత్త ఫీచర్స్ తో వచ్చాయి. ఈ కొత్త మోడళ్లలో యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ను ప్రధాన ఆకర్షణగా చెప్పుకోవచ్చు. కొత్తగా టచ్‌ సెన్సిటివ్‌ కెమెరాతో పాటు, యాక్షన్‌ బటన్‌ ఆప్షన్ ను పొందుపరిచారు. యాపిల్ ఐఫోన్-16 సిరీస్‌ ఫోన్లలో ఏ18 చిప్‌ ను అమర్చారు. న్యూరల్‌ ఇంజిన్‌తో కూడిన ఈ చిప్‌ రెండు రెట్లు వేగవంతంగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. 17 శాతం ఎక్కువ బ్యాండ్‌ విడ్త్‌ తో కూడిన అప్‌గ్రేడెడ్‌ మెమోరీ సబ్‌సిస్టమ్‌ను కలిగి ఉన్నట్లు యాపిల్‌ ప్రకటించింది.

యాపిల్‌ ఇంటెలిజెన్స్‌ సహాయంతో ఐపోన్-16లో యాప్‌ లను చాలా ఈజీగా ఉపయోగించుకోవచ్చని, వందలకొద్ది కొత్త యాక్షన్స్‌ చేపట్టవచ్చని కంపెనీ తెలిపింది. కొత్త సిరీస్‌ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం ఎక్కువగా ఉంటుందని యాపిల్‌ ప్రకటించినప్పటికీ వివరాలు వెల్లడించలేదు. ఐఫోన్-16 మొబైల్స్ కు సంబందించిన బుకింగ్స్ సెప్టెంబర్‌ 13 నుంచి ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్‌ 20 నుంచి ఐఫోన్-16 అందుబాటులోకి రానున్నాయి. ఈ కొత్త మోడళ్లలో యాపిల్‌ మ్యాగ్‌సేఫ్‌ ఛార్జింగ్‌ స్పీడ్‌ను 15 వాట్స్‌ నుంచి 25 వాట్స్‌కు పెంచడంతో చాలా వేగంగా చార్జింగ్ అవుతుంది.

ఇక ఐఫోన్‌-16 సిరీస్‌లో అనేక కొత్త ఫీచర్‌ లను యాపిల్‌ పరిచయం చేసింది. ఈ సిరీస్‌ ఫోన్లను ఎయిరోస్పేస్‌ గ్రేడ్‌ అల్యూమినియంతో తయారుచేశారు. గ్లాస్‌ బ్యాక్‌ ఫోన్లతో పోలిస్తే ఇది రెండు రెట్లు అధికంగా మన్నిక అని యాపిల్‌ తెలిపింది. ఐఫోన్‌ 16 డిస్‌ప్లే 6.1 అంగుళాల పొడవు ఉండగా, వెనిలా వేరియంట్‌తో దీన్ని రూపొందించారు. ఐఓఎస్‌ 18తో ఇది పనిచేస్తుండగా.. 2000 నిట్స్‌ వరకు బ్రైట్‌ నెస్‌ను పెంచుకోవచ్చు. ఐఫోన్‌ 16 ప్లస్‌ డిస్‌ప్లే 6.7 అంగుళాల పొడవుతో ఉంటుంది. దీంట్లో సూపర్‌ రెటినా ఎక్స్‌డీఆర్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ను అమర్చింది కంపెనీ. ఐఫోన్-16 వెనక వైపు 48 ఎంపీ వైడ్‌ యాంగిల్‌ కెమెరా అమర్చగా, 12 మెగాపిక్సెల్‌ అల్ట్రావైడ్‌ కెమెరా ఇచ్చారు. ముందు వైపు సెల్ఫీల కోసం 12 ఎంపీ కెమెరాను పొందుపరిచారు.

కెమెరా కంట్రోల్‌ బటన్‌తో చాలా సులభంగా ఫొటోలు, వీడియోలు తీసే ఫీచర్‌ ఉంది. ఐఫోన్‌ 16లో ఏఏఏ గేమ్స్‌ ఆడుకోవడానికి అవకాశం కల్పించారు. అంతకు ముందు ప్రో మోడల్స్‌లో మాత్రమే ఈ ఫీచర్‌ ఉండేది. ఇక భారత్‌లో ధరల విషయానికి వస్తే ఐఫోన్‌ 15 మోడళ్లతో పోలిస్తే 16 మోడళ్లు తక్కువ ధరలకే అందుబాటులోకి రానున్నాయి. 128 స్టోరేజీతో కూడిన ఐఫోన్‌-16 బేస్‌ మోడల్‌ ధర 79,900 రూపాయలు, ఐఫోన్‌ 16 ప్లస్‌ 89,900 రూపాయలతో ప్రారంభం కానున్నాయి. 128 జీబీ స్టోరేజీ గల బేస్‌ మోడల్‌ 16 ప్రో ధర 1,19,900 రూపాయలు, 256 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజీతో వచ్చే ప్రో 16 మాక్స్‌ 1,44,900 రూపాయలతో ఈ మోడళ్లు ప్రారంభమవుతాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular