Saturday, November 16, 2024

ఆపిల్ మినీ కంప్యూటర్ మార్కెట్లోకి వచ్చేస్తోంది

  • ఆపిల్ మినీ కంప్యూటర్ మార్కెట్లోకి వచ్చేస్తోంది
  • ఏఐ ఫీచర్స్ తో ఆపిల్ మ్యాక్ మిని

టెక్నాలజీ రంగంలో మరో విప్లవాత్మకమైన కంప్యూటర్ అందుబాటులోకి వస్తోంది. ప్రముఖ అమెరికా దిగ్గజ టెక్ సంస్థ ఆపిల్ మ్యాక్ మినీ పేరుతో చిన్ని కంప్యూటర్ ఆవిష్కరించేందుకు సిద్దమైంది. ఈ బుల్లి కంప్యూటర్ ఆపిల్ మ్యాక్ మినీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్ తో పాటు ఎం4 చిప్‌ తో బిల్డ్ అవుతోందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఆపిల్ రూపొందిస్తున్న ఈ మ్యాక్ మినీ డెస్క్ టాప్ కంప్యూటర్లలో అత్యంత బుల్లి కంప్యూటర్‌గా రికార్డులలోకెక్కనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను సపోర్ట్ చేసే ఎమ్-4 చిప్ వచ్చే అక్టోబర్‌ లో మార్కెట్లోకి వస్తుందని తెలుస్తోంది. ఈ మ్యాక్ మినీ కంప్యూటర్ ఆపిల్ టీవీ స్ట్రీమింగ్ డివైజ్ సైజును పోలి ఉంటుందని తెలుస్తంది. అంటే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మ్యాక్ మినీ కంప్యూటర్ కంటే 1.4 అంగుళాల పొడవుగానే ఉండనున్నట్లు సమాచారం.

ఆపిల్ మ్యాక్ మినీ అల్యూమినియం షెల్‌ తో ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న మ్యాక్ మినీ 599 డాలర్లు కాగా కొత్త వెర్షన్ మ్యాక్ మినీ ధర ఇంకా తక్కువగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ స్మాలెస్ట్ మ్యాక్ మినీతో పాటు ఈ ఏడాది చివర్లో ఎం-4 చిప్ పవర్డ్ ఐమ్యాక్స్, మ్యాక్ బుక్ ప్రోస్ ఆవిష్కరిస్తారని టెక్ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఆపిల్ లెటెస్ట్ ఐఫోన్ 16 సిరీస్‌ను సెప్టెంబర్-10వ తేదీన లాంచ్ చేయడానికి సిద్దమవుతోంది. ఈ సిరీస్‌ లో ఐఫోన్-16, ఐఫోన్-16 ప్లస్, ఐఫోన్-16 ప్రో, ఐఫోన్-16 ప్రో మ్యాక్స్ సిరీస్ లో స్మార్ట్‌ ఫోన్లు వస్తున్నాయి. ఈ మోడల్స్ ఫాస్ట్ వైర్డ్, వైర్‌లెస్ ఛార్జింగ్‌ కెపాసిటీతో రావచ్చని అంటున్నారు. ఈసారి ఐఫోన్ అప్‌ గ్రేడ్స్‌ మాత్రమే కాకుండా AI ఫీచర్లతో సర్‌ప్రైజ్ చేయనుంది ఆపిల్. ఐఓఎస్ 18లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ స్పెసిఫికేషన్స్ పెంచాలని యాపిల్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్టు రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో గప్పాలు కొట్టాడు అన్న హరీశ్ రావు వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..!
- Advertisment -

Most Popular